మారుతి డిజైర్ విజయ పరంపర: భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా వరుసగా మూడవ సారి!!

Written By:

మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ గత మూడు నెలలుగా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో నిలింది. ఫిబ్రవరి 2018లో ఎన్నో ఏళ్ల నుండి టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో కారును వెనక్కినెట్టి డిజైర్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.

 మారుతి డిజైర్ విజయ పరంపర

మూడవ తరానికి చెందిన న్యూ డిజైర్ 2017లో విపణిలోకి లాంచ్ అయ్యింది. ఫిబ్రవరి 2018లో 20,941 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 16,613 విక్రయాలతో పోల్చుకుంటే 26శాతం వృద్దిని సాధించింది.

 మారుతి డిజైర్ విజయ పరంపర

ఎంతో కాలంగా మారుతి సుజుకి మరియు భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కారుగా నిలిచిన ఆల్టో 19,760 యూనిట్ల సేల్స్‌తో కేవలం 1 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసుకుంది.

 మారుతి డిజైర్ విజయ పరంపర

డిజైర్ ఆధారిత స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అదే నెలలో 17,291 యూనిట్ల సేల్స్ జరిపింది. గత ఏడాది ఫిబ్రవరి అమ్మకాలతో పోల్చుకుంటే కొత్త తరం స్విఫ్ట్ 40శాతం వృద్దిని సాధించి టాప్ 10 ప్యాసింజర్ కార్ల జాబితాలో మూడవ స్థానాన్ని పధిలం చేసుకుంది.

 మారుతి డిజైర్ విజయ పరంపర

థర్డ్ జనరేషన్ న్యూ మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అత్యంత పోటీతత్వముతో కూడిన రూ. 5.5 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది. మారుతి సుజుకి ఇప్పటి వరకు పరిచయం చేయని ఎన్నో ఫీచర్లు మరియు నూతన టెక్నాలజీని అందించి, ధరకు తగ్గ విలువలతో లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 మారుతి డిజైర్ విజయ పరంపర

సాంకేతికంగా న్యూ మారుతి డిజైర్ కారులో అవే మునుపటి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఇందులోని 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
 మారుతి డిజైర్ విజయ పరంపర

డిజైర్ సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. డిజైర్‌ను సరికొత్త హార్టెక్ ప్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. మారుతి లైనప్‌లో ఉన్న బాలెనో మరియు స్విఫ్ట్ కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. కారు బరువు తగ్గడం మరియు మైలేజ్ పెరగడం హార్టెక్‌ ‌ఫ్లాట్‌ఫామ్ ప్రత్యేకత.

 మారుతి డిజైర్ విజయ పరంపర

సేఫ్టీ పరంగా మారుతి డిజైర్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా పరంగా మునుపటి తరానికి చెందిన డిజైర్‌తో పోల్చుకుంటే ఖరీదైన మరియు లగ్జరీ ఫీల్ ఇందులో పొందవచ్చు.

 మారుతి డిజైర్ విజయ పరంపర

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అన్ని రకాల కస్టమర్లను మరియు అన్ని రకాల వయస్సున్న వారిని ఆకట్టుకునేలా డిజైన్ పరంగా మారుతి తమ న్యూ డిజైర్‌లో అద్భుతం చేసిందనే చెప్పాలి. చూడటానికి అచ్చం వెనుక వైపున డిక్కీ తగిలించిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌నే పోలి ఉంటుంది. కానీ, ధర పరంగా స్విఫ్ట్ మరియు డిజైర్ మధ్య ఓ మోస్తారు వ్యత్యాసం మాత్రమే ఉంటుంది.

మారుతి డిజైర్ విజయ పరంపర

1. నిస్సాన్ మరియు డాట్సన్ కార్లు ఇప్పుడు మరింత ప్రియం

2.కంపాస్ ట్రయల్‌హాక్ మీద బుకింగ్స్ ప్రారంభించిన జీప్

3.అన్ని కార్ల మీద భారీగా ధరలు పెంచిన టాటా మోటార్స్

4.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్: ఎంత డబ్బు ఇచ్చినా నన్ను దక్కించుకోలేరు...!!

5.బుకింగ్స్ మరియు వెయిటింగ్ పీరియడ్‌కు సరికొత్త నిర్వచనమిచ్చిన మారుతి స్విఫ్ట్

English summary
Read In Telugu: Maruti Dzire Tops Sales Chart Three Months In A Row

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark