డిజైర్ టూర్ సిఎన్‌జి వేరియంట్ స్పెసిఫికేషన్స్ బట్టబయలు

Written By:

భారతీయ రోడ్ల మీద పరుగులు పెడుతున్న అద్దె కార్లలో మారుతి డిజైర్ టూర్ కార్లే ఎక్కువగా దర్శనమిస్తాయి. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే డిజైర్ కారును గత ఏడాది సరికొత్త వెర్షన్‌లో లాంచ్ చేసిన మారుతి సుజుకి ఇప్పుడు తమ ఫేమస్ డిజైర్ టూర్ కారును కొత్త ఇంజన్ వెర్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

మారుతి రహస్యంగా అభివృద్ది చేసిన డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి మోడల్ గుర్తింపు కోసం ఏఆర్ఏఐకి సమర్పించిన పత్రాలు లీక్ అయ్యాయి. దీంతో డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి వేరియంట్ విడుదల ఖాయమయ్యింది.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

సాంకేతికంగా మారుతి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి వేరియంట్లో 1.2-లీటర్ ఫ్లెక్స్-ఫ్యూయల్(పెట్రోల్ లేదా సిఎన్‌జి) ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది పెట్రోల్ లేదా సిఎన్‌జి ఇంధనంతో నడుస్తుంది. పెట్రోల్ వెర్షన్ 82.8బిహెచ్‌పి పవర్ మరియు సిఎన్‌జి వెర్షన్ 74బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

మారుతి సుజుకి ఆల్ న్యూ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ విడుదల చేయడానికి ముందు ఏప్రిల్ 2017లో డిజైర్ టూర్ ఎస్ మోడల్‌ను మారుతి లాంచ్ చేసింది. మారుతి డిజైర్ టూర్ ఎస్ కారు సెకండ్ జనరేష్ డిజైర్ యొక్క ట్యాక్సీ వెర్షన్.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

రెగ్యులర్ మారుతి డిజైర్ టూర్ కారు సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. పెట్రోల్ వేరియంట్ 80బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ వేరియంట్ 74బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

మారుతి డిజైర్ టూర్ ఎస్ మోడల్‌లో స్పీడ్ గవర్నర్ ఏర్పాటు చేశారు. ఇది కారు వేగాన్ని గంటకు 80కిలోమీటర్లకు పరిమితి చేస్తుంది. సిఎన్‌జి ఇంజన్ కిట్ మరియు స్పీడ్ గవర్నర్ మినహాయిస్తే అన్ని ఫీచర్లు మరియు డిజైన్ పరంగా ఇది సెకండ్ జనరేషన్ డిజైర్‌నే పోలి ఉంటుంది.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

స్టాండర్డ్ వేరియంట్ డిజైర్ వేరియంట్‌ను పోలి ఉన్నప్పటికీ, మారుతి డిజైర్ టూర్ ఎస్ వేరియంట్లో కొన్ని ఫీచర్లు మిస్సయ్యాయి. డిజైర్ టూర్ ఎస్ ఫ్రంట్ డిజైన్‌లో ప్లాస్టిక్ గ్రిల్, సిల్వర్ కలర్ స్టీల్ వీల్స్ మరియు బ్లాక్ కలర్‌లో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

మారుతి డిజైర్ టూర్ ఎస్ ట్యాక్సీ మోడల్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజి ఇంటీరియర్, సీట్లు మరియు బీజి ఫ్యాబ్రిక్‌తో ఉన్న అప్‌హోల్‌స్ట్రే ఉన్నాయి. ఇతర ఫీచర్లయిన పవర్ విండోలు మరియు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ సిఎన్‌జి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అద్దె కార్లు మరియు ట్యాక్సీ నిర్వహణకు మారుతి డిజైర్ టూర్ ఎస్ అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ సెడాన్ కారు. ఇప్పుడు, పెట్రోల్ మరియు సిఎన్‌జి రెండు రకాల ఇంధనంతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ ఆప్షన్‌లో డిజైర్ టూర్ ఎస్ వేరియంట్‌ను లాంచ్ చేయడానికి మారుతి సిద్దమైంది. సిఎన్‌జి వెర్షన్ రెగ్యులర్ మోడల్ కంటే తక్కువ ధరలో లభించనుంది. దీంతో ఈ మోడల్ విడుదల ఇటు ట్యాక్సీ నిర్వాహకులకు మరియు సంస్థకు లాభాన్ని చేకూర్చనుంది.

Source: IAB

English summary
Read In Telugu: Maruti Dzire Tour S CNG Specifications Leaked Ahead Of Launch

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark