ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ విడుదల విషయంలో దూకుడు పెంచిన మారుతి

Written By:

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి చివరిగా విడుదల చేసిన స్విఫ్ట్ మరియు న్యూ డిజైర్ కార్లతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు, ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పీవీని విడుదల చేయడానికి మారుతి సిద్దమవుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి ఫేస్‌లిఫ్ట్ ఎర్టిగా ఎమ్‌పీవీని వచ్చే ఆగష్టు నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో మారుతి సుజుకి ఎర్టిగా ఫే‌లిఫ్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించాల్సి ఉండగా, న్యూ స్విఫ్ట్ లాంచ్ మరియు కాన్సెప్ట్ మోడళ్ల ప్రదర్శన కారణంగా ఎర్టిగా ఎమ్‌పీవీ అంశాన్ని ప్రక్కన పెట్టింది.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

సెకండ జనరేషన్ మారుతి ఎర్టిగాను అంతర్గతంగా వైహెచ్ఎ కోడ్ పేరుతో డెవలప్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు దీనిని ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. దీని గురించి ఎక్కువ వివరాలు లభించనప్పటికీ ఖచ్చితంగా భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఉన్న మారుతి ఎర్టిగా కంటే రెండవ తరానికి చెందిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగా ఎక్కువ పొడవు మరియు వెడల్పుతో విశాలమైన క్యాబిన్‌తో వస్తున్నట్లు సమాచారం. మూడవ వరుస సీటింగ్ కోసం పొడవు పెంచడం జరిగింది. దీంతో డిక్కీ స్పేస్ కూడా సాధ్యమైంది.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ప్రతి ఫ్యామిలీని ఆకట్టుకునే విధంగా రియర్ డిజైన్‌లో ఆకర్షణీయమైన స్పాయిలర్, సైడ్ డిజైన్‌లో అట్రాక్టివ్ క్యారెక్టర్ లైన్స్ మరియు సరికొత్త డిజైన్‌లో అల్లాయ్ వీల్స్ వంటివి కీలకమైన డిజైన్ మార్పులు ఇందులో చోటు చేసుకోనున్నాయి.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

కొత్త తరం మారుతి ఎర్టిగా ఫ్రంట్ డిజైన్‌లో బానెట్ ఎత్తు పెరగనుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, అధునాతన ఫ్రంట్ గ్రిల్ మరియు సరికొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఎర్టిగా ఫ్రంట్ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా సెకండ్ జనరేషన్ మారుతి ఎర్టిగా అవే 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యంకానుంది. అధిక మైలేజ్ కోసం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ పరిచయం చేయనుంది. అంతే కాకుండా, సరికొత్త 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కూడా అందించే అవకాశం ఉంది.

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎమ్‌పీవీ వాహనాలలో మారుతి సుజుకి ఎర్టిగా మరియు రెనో లాజీ మోడళ్లు ఉన్నాయి. ఖరీదైన ఎమ్‌పీవీల జాబితాలో టయోటా ఇన్నోవా క్రిస్టా రాణిస్తోంది. సౌకర్యవంతమైన ఇంటీరియర్, అధునాతన మరియు అత్యాధునిక ఫీచర్లు, కీలకమైన సేఫ్టీ ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లతో ఎర్టిగా ఎమ్‌పీవీని ధరకు తగ్గ విలువలతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రవేశపెట్టడానికి మారుతి సిద్దమైంది.

ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మారుతి ఖాతాలో మరో సక్సెస్ ఖాయమని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Maruti Ertiga Facelift India Launch: Specifications, Features & Launch Details
Story first published: Sunday, March 18, 2018, 9:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark