TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మారుతి కార్ల కోసం ఏక కాలంలో లక్ష మంది కస్టమర్ల నిరీక్షణ
మారుతి సుజుకి ఇండియా లైనప్‌లోని స్విఫ్ట్, బాలెనో, డిజైర్ మరియు వితారా బ్రిజా కార్ల మీద విపరీతమైన డిమాండ్ నమోదవుతోంది. ఈ నాలుగు కార్ల మీద నమోదైన 1,10,000 యూనిట్ల ఆర్డర్లు పెండింగులో ఉన్నాయి. ఈ కార్లు డెలివరీ తీసుకోవడానికి లక్షా పది వేల మంది కస్టమర్లు నిరీక్షిస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ మరియు వితారా బ్రిజా కార్ల మీద వెయిటింగ్ పీరియడ్ తగ్గించి, అతి తక్కువ వ్యవధిలోనే కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకు మారుతి సుజుకి తమ గుజరాత్ తయారీ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది.
సరికొత్త మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018 వేదికగా మార్కెట్లోకి విడుదలయ్యింది. అనతి కాలంలో భారతదేశపు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది.
విడుదలైన మొదటి రెండు నెలలలోపే మారుతి స్విఫ్ట్ మీద లక్ష యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. మరియు 2017-18 ఆర్థిక సంవత్సరంలో మారుతి స్విఫ్ట్ ఇండియా యొక్క నాలుగవ బెస్ట్ సెల్లింగ్ కారుగా స్థానం సంపాదించుకుంది.
మారుతి సుజుకి కొత్త తరం డిజైర్ కారును దాదాపు ఏడాది క్రితమే మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయంగా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతి డిజైర్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. విడుదలైన మొదటి ఐదు నెలల్లో 1,00,000 యూనిట్ల డిజైర్ కార్లను మారుతి విక్రయించింది. మరియు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా స్థానం సంపాదించుకుంది.
ఏప్రిల్ 2018 మాసంలో మారుతి సుజుకి 1.72 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇదే కాలంలో హ్యుందాయ్ ఇండియా కేవలం 59,744 యూనిట్లను విక్రయించి ద్వితీయ స్థానంలో నిలిచింది. విపణిలో మారుతి సుజుకి కార్లకు ఉన్న డిమాండుకు ఈ గణాంకాలే సాక్ష్యం.
గత ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల యూనిట్ల మారుతి సుజుకి వితారా బ్రిజా కార్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మారుతి సుజుకి వారి కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజా మీద ఇదే తరహా సేల్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
అదే విధంగా మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం స్విఫ్ట్, బాలెనో, డిజైర్ మరియు వితారా బ్రిజా మోడళ్లలో మారుతి సుజుకి అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ఇండియా యొక్క టాప్ బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో అత్యధికంగా మారుతి కార్లే ఉన్నాయి. దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మారుతి 55 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్రొడక్షన్ ప్లాంటులో కేవలం ఒక లైన్ ద్వారా మాత్రమే బాలెనో కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్లాంటు యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచాలని చూస్తోంది. గుజరాత్ ప్లాంటులో మరిన్ని అదనపు ప్రొడక్షన్ లైన్లకు విస్తరించి 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.5 లక్షలకు పెంచే ఆలోచనలో ఉంది.
Source: moneycontrol