మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

By Anil Kumar

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇగ్నిస్ డీజల్ వెర్షన్ విక్రయాలను నిలిపివేసింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఇగ్నిస్ డీజల్ వెర్షన్ వేరియంట్లకు ఆశించిన మేర ఆదరణ లభించకపోవడంతో మార్కెట్ నుండి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

మారుతి సుజుకి ఇగ్నిస్ డీజల్ వెర్షన్ 1.3-లీటర్ కెపాసిటి గల డిడిఐఎస్ డీజల్ఇంజన్‌తో లభ్యమవుతోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

మారుతి ఇగ్నిస్ మొత్తం విక్రయాల్లో డీజల్ వేరియంట్ల వాటా కేవలం 10 శాతం మాత్రమే. మిగిలిన 90 శాతం సేల్స్ పెట్రోల్ వేరియంట్ల నుండి వస్తున్నాయి. మారుతి ఇగ్నిస్ జనవరి 2017లో తొలిసారిగా ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. మారుతి ఇగ్నిస్ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ నెక్సా ద్వారా విక్రయిస్తోంది. మారుతి ఇగ్నిస్‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ అదే విధంగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌, పలు విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో పాటు కస్టమైజేషన్ ప్యాకేజీలతో ప్రవేశపెట్టింది.

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

మారుతి ఇగ్నిస్ క్రాసోవర్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో ముందు మరియు వెనుక వైపున నెక్సా సేఫ్టీ షీల్డ్ మరియు ప్రి-టెన్షనర్లు ఉన్నాయి.

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

ఇగ్నిస్ హ్యాచ్‌‌బ్యాక్ ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి గల ఇది మిర్రర్ లింక్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

ఇగ్నిస్ డీజల్ వెర్షన్ మార్కెట్ నుండి నిష్క్రమించినప్పటికీ, పెట్రోల్ వెర్షన్ యథావిధిగా కొనసాగుతుంది. ఇగ్నిస్ పెట్రోల్ వెర్షన్‌లో 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి ఇగ్నిస్ డీజల్ కార్లను ఇక మీదట కొనలేరు!!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి ఇగ్నిస్ ఫన్ డ్రైవింగ్ ఫీల్ కలిగించే క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్, దీని ప్రారంభ ధర రూ. 4.66 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ). మారుతి ఇగ్నిస్ విపణిలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మహీంద్రా కెయువి100 మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

Source: GaadiWaadi

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Ignis Diesel Version Discontinued In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X