ఈ ఏడాది మారుతి విడుదలకు సిద్దం చేసిన కొత్త కార్లు

మారుతి సుజుకి ఫిబ్రవరి నెలలో స్విఫ్ట్ విడుదలతో పాటు మిగతా కొత్త మోడళ్ల విడుదలకు సన్నద్దమవుతోంది. కొత్త తరం స్విఫ్ట్ తరువాత, నూతన వ్యాగన్ఆర్ మరియు ఎర్టిగా ఎమ్‌పీవీ లను వరుసగా లాంచ్ చేయనుంది.

By Anil

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ కొత్త సంవత్సరంలో మూడు సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇందులో మారుతి తమ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఫిబ్రవరిలో జరగబోయే 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద తొలి ప్రదర్శన చేయనుంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుతో పాటు, మారుతి సుజుకి మరో రెండు మోడళ్లను విపణిలోకి పరిచయం చేయనుంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

మారుతి సుజుకి ఫిబ్రవరి నెలలో స్విఫ్ట్ విడుదలతో పాటు మిగతా కొత్త మోడళ్ల విడుదలకు సన్నద్దమవుతోంది. కొత్త తరం స్విఫ్ట్ తరువాత, నూతన వ్యాగన్ఆర్ మరియు ఎర్టిగా ఎమ్‌పీవీ లను వరుసగా లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ మూడు మోడళ్లు కూడా ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఉన్నాయి. కాబట్టి కొత్త తరం వెర్షన్‌లో వస్తున్న ఇవి ఎలాంటి మార్పులతో వస్తున్నాయో చూద్దాం రండి...

Recommended Video

Shocking Car Accident That Happened In Karunagappally, Kerala
మారుతి సుజుకి కొత్త కార్లు

థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

సరికొత్త 2018 స్విఫ్ట్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులతో ఎన్నో కొత్త ఫీచర్లతో వస్తోంది. ఈ 2018 స్విఫ్ట్ ‌ను మారుతి తేలికపాటి హార్టెక్ ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసి, నిర్మించింది. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద బాలెనో మరియు న్యూ డిజైర్ కార్లను కూడా అభివృద్ది చేసింది.

మారుతి సుజుకి కొత్త కార్లు

సాంకేతికంగా 82బిహెచ్‌పి మరియు 74బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేయగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా వచ్చే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

2018 మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన టాల్ బాయ్ స్టైల్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ తిరుగులేని సేల్స్ సాధిస్తోంది. ఎలాంటి అప్‌డేట్స్ నిర్వహించికపోయినా, పోటీగా ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా నిలకడైన ఫలితాలు సాధిస్తూ, మారుతి లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు దీనిని సరికొత్త వెర్షన్‌లో లాంచ్ చేయడానికి మారుతి సిద్దమైంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

కొత్త తరం మారుతి వ్యాగన్ఆర్ ఇంటీరియర్‌తో పాటు ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాంకేతికంగా 1.0-లీటర్ ఇంజన్‌తో రానున్న వ్యాగన్ఆర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. పెట్రోల్‌తో పాటు ఎల్‌పిజి మరియు సిఎన్‌జి మోడళ్లు కూడా అప్‌డేట్ కానున్నాయి.

Trending On DriveSpark Telugu:

మారుతి సుజుకి కొత్త కార్లు

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

2018లో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీని కూడా అప్‌డేట్ చేయనుంది. నూతన డిజైన్ మరియు మెకానికల్ పరంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2018 ఎర్టిగా ఎమ్‌పీవీని కంపెనీ యొక్క హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనుంది. మారుతి ఇప్పటికే పలుమార్లు ఎర్టిగా ఫే‌స్‌లిఫ్ట్‌ను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో రానుంది. రెండు ఇంజన్ ఆప్షన్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి. 7-సీటర్ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో కూడా కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 ఏడాదితో మారుతి సుజుకి ఇండియాలో విక్రయిస్తున్న మోడళ్లను పునరుద్దరించనుంది. పాత మోడళ్ల స్థానంలో ఎన్నో మార్పలు, చేర్పులు చేసి కొత్త తరం మోడళ్లుగా ప్రవేశపెట్టనుంది. అప్‌డేట్ చేసిన కార్లను వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా ఆవిష్కరించనుంది.

తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Monday, January 1, 2018, 15:42 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki To Launch Three New Cars In 2018 — Here Are The Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+