మతి పోగొడుతున్న న్యూ మారుతి సియాజ్ ఫేస్‌‌లిఫ్ట్

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దం చేసింది. 2018లో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరో నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సియాజ్

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దం చేసింది. 2018లో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరో నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఫోటోలు ఇంటర్నెట్ వేదికగా లీక్ అయ్యాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ఈ కొత్త తరం 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారు ధర ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చుకుంటే కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో ఉన్న పలు నెక్సా డీలర్లు రూ. 11,000 ధరతో బుకింగ్స్ ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఉన్న సియాజ్‌తో పోల్చుకుంటే సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్‌లో పలు కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి. సియాజ్ ముందు వైపున రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు చతుర్భుజాకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌తో పాటు సరికొత్త ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ మెరుగులు ఉన్నాయి మరియు కండలు తిరిగిన రూపాన్ని గుర్తించవచ్చు. బానెట్ మీద అద్దం నుండి ఫ్రంట్ గ్రిల్ వరకు క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు జరగలేదు. వెనుక వైపున రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్ హౌసింగ్ మరియు బంపర్ ఉన్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

రహ్యంగా లీకైన ఫోటోల ద్వారా ఇంటీరియర్‌ను పరిశీలిస్తే, డ్యాష్‌బోర్డు మీద లైట్ కలర్ ఫాక్స్ వుడ్ లేయర్ గమనించవచ్చు. క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ వీల్ మీద పలు రకాల బటన్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో అధునాతన 1.5-లీటర్ కెపాసిటి గల కె15బి పెట్రోల్ ఇంజన్‌‌ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

డీజల్ ప్రియుల కోసం అదే మునుపటి 1.3-లీటర్ డిడిఐస్ డీజల్ ఇంజన్‌ను యధావిధిగా వస్తోంది. కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే ఇది గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లోని మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మారుతి సియాజ్ సెడాన్ అత్యధిక విక్రయాలు సాధిస్తోంది. భారీ మార్పులు చేర్పులతో వస్తున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ పూర్తి స్థాయిలో విడుదలైతే భారీ సేల్స్ సాధించడం ఖాయం.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రీమియం సెడాన్ కారుగా మరో సంచనలం సృష్టించనుంది. అధునాతన ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌‌తో పాటు పలు సేఫ్టీ ఫీచర్ల జోడింపుతో పోటీదారులకు చుక్కలు చూపెట్టనుంది. 2018 సియాజ్ కారు హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు టయోటా యారిస్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: Autoportal

More from DriveSpark

Article Published On: Saturday, July 28, 2018, 17:25 [IST]
English summary
Read In Telugu: 2018 Maruti Suzuki Ciaz Facelift Spied Ahead Of Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+