ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. 2020 నాటికి మారుతి సుజుకి తమ తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది.

By Anil Kumar

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. 2020 నాటికి మారుతి సుజుకి తమ తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్‍‌ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది.

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సుజుకి టయోటా భాగస్వామ్యంతో వ్యాగన్ఆర్ యొక్క ఇ-వెర్షన్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్‍‌గా వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ నిలుస్తుంది.

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

మారుతి అధికారులు మాట్లాడుతూ, "కంపెనీ అభివృద్ది చేస్తున్న వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును గుజరాత్‌లోని సనంద్ ప్లాంటులో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టయోటా కూడా బ్యాటరీ తయారీ యూనిట్‌ను దీనికి దగ్గరలోనే ఏర్పాటు చేస్తోంది."

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, మారుతి సుజుకి మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ భాగస్వామ్యంలో మార్కెట్లోకి రానున్న మొదటి మోడల్ కూడా ఇదే. అల్ట్రాహై-ఎఫీషియన్సీ పవర్‌ట్రైన్ నిర్మించేందుకు మారుతి సుజుకి కంపెనీకి సహకరిస్తామని టయోటా ఇది వరకే ప్రకటించింది.

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

మారుతి సుజుకి తరువాత తరం వ్యాగన్ఆర్ కారును కూడా లాంచ్ చేయడానికి సిద్దం అవుతోంది. దీని విడుదల బహుశా ఈ ఏడాది చివరలో ఉండవచ్చు. సరికొత్త తేలికపాటి ఫ్లాట్‌ఫామ్ మీద వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ వెర్షన్ బరువు గణనీయంగా తగ్గిపోతుంది.

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్‌కు ఏ ప్లాంటును ఎంచుకోవాలని ఇంకా తర్జనభర్జన పడుతూనే ఉంది. ప్రస్తుతానికి, స్టాండర్డ్ వెర్షన్ వ్యాగన్ఆర్ కారును గుర్గావ్‌లోని మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రతినిధుల కథనం మేరకు, వ్యాగన్ఆర్ ప్రస్తుతం ఉత్పత్తి మానేసర్‌లోనే ఉంది కాబట్టి, ఎలక్ట్రిక్ వెర్షన్ ఉత్పత్తి కూడా ఇక్కడే జరగనుంది. అయితే, వీటికి కావాల్సిన బ్యాటరీలను గుజరాత్‌ నుండి సేకరించనున్నట్లు తెలిపారు. అయితే, వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి వినియోగించే ప్లాంటు గురించి స్పష్టమైన సమాచారం లేదు.

ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి మారుతి సుజుకి: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుగా వ్యాగన్ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఎట్టకేలకు ప్యాసింజర్ కార్ల విపణిలోకి ప్రవేశించడానికి సిద్దమైంది. 1999లో విడుదలైన వ్యాగన్ఆర్ ఇప్పటికీ అద్భుతమైన సేల్స్ సాధిస్తుండటంతో వ్యాగన్ఆర్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టాలనుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పరిజ్ఞానం కోసం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ కంపెనీకి టయోటా కిర్లోస్కర్ మోటార్ సహకరించనుంది.

Source: BusinessLine

More from DriveSpark

Article Published On: Wednesday, June 6, 2018, 10:26 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki Electric WagonR To Be Launched In 2020 — To Be Company's First Electric Car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+