అన్ని మోడళ్ల మీద ధరలు పెంచేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి విపణిలో ఉన్న దాదాపు అన్ని కార్ల మీద ధరలు పెంచేసింది. ప్రతి కారు మీద గరిష్టంగా రూ. 6,100 వరకు పెంచినట్లు మారుతి ఓ ప్రకటనలో పేర్కొంది. ధరల పెంపు అనంతరం సవరించబడిన కొత్త ధరలు ఆగష్టు 16, 201

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలో ఉన్న దాదాపు అన్ని కార్ల మీద ధరలు పెంచేసింది. ప్రతి కారు మీద గరిష్టంగా రూ. 6,100 వరకు పెంచినట్లు మారుతి ఓ ప్రకటనలో పేర్కొంది. ధరల పెంపు అనంతరం సవరించబడిన కొత్త ధరలు ఆగష్టు 16, 2018 నుండి అమల్లోకి వచ్చాయి.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

మారుతి సుజుకి తమ ప్యాసింజర్ కార్ల మీద ధరలు పెంచడం ఇది రెండోసారి. గతంలో జనవరి 2018లో చేపట్టిన ధరల పెంపులో కనిష్టంగా రూ. 1,700 నుండి గరిష్టంగా రూ. 17,000 వరకు పెరిగాయి. ముడిసరుకు, సరఫరా ఖర్చుల పెరగడంతో పాటు విదేశీ కరెన్సీతో రూపాయి మారకం రేటు పడిపోవడం తాజాగా చేపట్టిన ధరలు పెంపుకు ప్రధాన కారణాలను తెలిసింది.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

ఒక్కొక్క మోడల్ మీద ఎంత మేరకు ధరలు పెరిగాయనే విషయాన్ని మారుతి సుజుకి ఇంకా వెల్లడించలేదు. అయితే, ధరల పెంపు పట్ల తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే, ఎంట్రీ లెవల్ కార్ల మీద చాలా తక్కువ మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో అరెనా మరియు నెక్సా అనే రెండు రకాల షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తోంది. ప్రారంభ మోడల్ ఆల్టో నుండి అత్యంత ఖరీదైన మారుతి హైఎండ్ మోడల్ ఎస్-క్రాస్ వరకు ఎన్నో ప్యాసింజర్ కార్ల మారుతి ఇండియా లైనప్‌లో ఉన్నాయి.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

తాజాగా చేపట్టిన ధరల పెంపుకు అనుగుణంగా, మారుతి ఆల్టో ప్రారంభ ధర రూ. 2.52 లక్షల నుండి గరిష్టంగా రూ. 3.81 లక్షలతో లభ్యమవుతోంది. అదే విధంగా మారుతి స్విఫ్ట్ ధరల శ్రేణి రూ. 4.99 లక్షల నుండి రూ. 8.76 లక్షలు మధ్య ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

మారుతి చేపట్టిన ధరల పెంపు మారుతి స్విఫ్ట్ మీద చాలా తక్కువగా ఉంది, స్విఫ్ట్ సేల్స్ మీద ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. అతి త్వరలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మారుతి సుజుకి సియాజ్ సెడాన్ కారును భారీ మార్పులు చేర్పులతో తీవ్ర అంచనాల మధ్య విడుదల చేయనుంది.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

మారుతి సుజుకి మాత్రమే కాదు, జపాన్‌కు చెందిన హోండా కార్స్ కూడా ఇటీవల ధరల పెంపు చేపట్టింది. హోండా అమేజ్ సెడాన్ మీద ఏకంగా రూ. 31,000 పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా అన్ని మోడళ్ల మీద ధరలు పెంచే ఆలోచనలో ఉంది, అతి త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మారుతి కార్ల మీద పెరిగిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి దేశీయంగా విక్రయిస్తున్న అన్ని మోడళ్ల మీద ధరల పెంపు చేపట్టినట్లు ప్రకటించింది. అయితే, ఈ పెంపు స్వల్పంగా మాత్రమే ఉంది. మారుతి లైనప్‌లో ఉన్న ఆల్టో 800, సెలెరియో మరియు వ్యాగన్ఆర్ హై ఎండ్ మోడల్ ఎస్-క్రాస్ వరకు దాదాపు అన్ని మోడళ్ల మీద స్వల్పమేర ధరలు పెరిగాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Hikes Prices Across The Range By Up To Rs 6,100
Story first published: Friday, August 17, 2018, 10:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X