మారుతి సుజుకి జిప్సీ స్థానంలోకి మారుతి జిమ్నీ

4X4 డ్రైవ్‌ సిస్టమ్‌ విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి సుజుకి ఉత్పత్తుల్లో మారుతి జిమ్నీ ఒకటి. కఠినమైన చూపులతో, అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పొట్టిగా ఉన్న కొలతలు వంటి కారణాలతో మారుతి జమ్నీ

By Anil Kumar

4X4 డ్రైవ్‌ సిస్టమ్‌ విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి సుజుకి ఉత్పత్తుల్లో మారుతి జిమ్నీ ఒకటి. కఠినమైన చూపులతో, అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పొట్టిగా ఉన్న కొలతలు వంటి కారణాలతో మారుతి జమ్నీ ఎంతో మంది ఇండియన్స్ హృదయాలను దోచుకుంది.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి తమ జమ్నీ కూడా ల్యాడర్ ఫ్రేమ్ ఆధారంగా 3-లింక్ రిజిడ్-యాక్సిల్ సస్పెన్షన్ మీద నిర్మించింది. సుజుకి మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లోకి జిప్సీ విజయానికి కొనసాగింపుగా జిమ్నీ స్మాల్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది.

మారుతి సుజుకి జిమ్నీ

2018 జమ్నీకి రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తుండగా పలుమార్లు పట్టుబడింది. తాజాగా, జపాన్ దిగ్గజం సుజుకి మోటార్స్ తమ అఫీషియల్ వెబ్‌సైట్లో జిమ్నీ మోడల్ చేర్చింది. ఇప్పుడిది, సుజుకి అంతర్జాతీయ విడుదలను సూచిస్తోంది.

సుజుకి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో....

మారుతి సుజుకి జిమ్నీ

సుజుకి జిమ్నీ మోడల్స్ మరియు వేరియంట్లు

2018 మోడల్ జిమ్నీ ఒక్కసారి విడుదలైతే, నాలుగవ తరానికి చెందిన జిమ్నీ మార్కెట్లోకి వచ్చినట్లు. మొదటి సుజుకి జిమ్నీ వాహనాన్ని తొలిసారిగా 1970లో లాంచ్ చేసింది, అప్పట్లో 4-వీల్ డ్రైవ్‌తో విడుదలైన మొట్టమొదటి మరియు ఏకైక స్మాల్ కాంపాక్ట్ కారు ఇదే.

మారుతి సుజుకి జిమ్నీ

రెండవ తరం జిమ్నీ మోడల్‌ను 1981లో విడుదల చేశారు. ఈ మోడల్ ఇండియాలో జిప్సీ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత 1998లో అప్‌గ్రేడెడ్ వెర్షన్ మూడవ తరానికి చెందిన అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి నుండి సుమారుగా 20 ఏళ్ల పాటు అదే మోడల్ విక్రయాల్లో ఉంది.

మారుతి సుజుకి జిమ్నీ

సుజుకి జిమ్నీ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. అవి, స్టాండర్డ్ వెర్షన్ మరియు సియెర్రా. సియెర్రా మోడల్‌లో ఎక్కువ ఫీచర్లు మరియు ఎన్నో ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. రెండు వేరియంట్లు కూడా XG, XL & XC మూడు ఉప వేరియంట్లలో లభ్యమవుతున్నాయి.

మారుతి సుజుకి జిమ్నీ

సుజుకి జిమ్నీ ఇంజన్ స్పెసిఫికేషన్స్

2018 సుజుకి జిమ్నీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతుంది. స్టాండర్డ్ వెర్షన్ కోసం 660సీసీ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. రెండు పెట్రోల్ ఇంజన్‌లు కూడా వరుసగా 63 మరియు 100బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి.

మారుతి సుజుకి జిమ్నీ

ఈ రెండు ఇంజన్‌లు కూడా థర్డ్ జనరేషన్ జిమ్నీలో ఉండేవి. వీటిని యథావిధిగా ఫోర్త్ జనరేషన్ జిమ్నీలో కొనసాగించారు. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మి‌షన్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి జిమ్నీ

అంతే కాకుండా, ఇండియన్ వెర్షన్ జిమ్నీ కోసం ఇది వరకు ఉన్న 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టుర్భో పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఖరారు చేసే అవకాశం ఉంది. మరో ప్రధాన హైలైట్ ఏమిటంటే...? ఆల్‌గ్రిప్ ప్రో 4X4 సిస్టమ్ రావడం. ప్రతి ఇండియన్ భూభాగాలను చేధించేందుకు ఇదొక బెస్ట్ ఛాయిస్ కానుంది.

మారుతి సుజుకి జిమ్నీ

సుజుకి జిమ్నీ ఫీచర్లు

2018 సుజుకి జిమ్నీ ఎన్నో అత్యాధునిక మరియు అత్యంత కీలకమైన ఫీచర్లతో వస్తోంది. అప్‌డేటెడ్ ఎక్ట్సీరియర్‌కు తగ్గట్లుగా మోడ్రన్ ఇంటీరియర్ అందివ్వడం జరిగింది. జిమ్నీలో ఉన్న పలు ముఖ్యమైన ఫీచర్లు...

  • 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటి
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • పుష్-బటన్ స్టార్ట్
  • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్
  • క్రూయిజ్ కంట్రోల్
  • ఆడియో మరియు ఫోన్ కోసం స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్
  • మారుతి సుజుకి జిమ్నీ

    సుజుకి జిమ్నీ లభించే రంగులు

    సరికొత్త 2018 జిమ్నీ ఐదు విభిన్న సింగల్ టోన్ మరియు మూడు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. డ్యూయల్ టోన్ స్కీమ్‌లో రెగ్యులర్ పెయింట్‌ స్కీమ్‌కు బ్లాక్ రూఫ్ జోడిస్తుంది. అవి, కైనటిక్ యెల్లో, బ్రిస్క్ బ్లూ మెటాలిక్ మరియు చిఫన్ ఇవోరి మెటాలిక్.

    మారుతి సుజుకి జిమ్నీ

    సింగల్ టోన్ పెయింట్ స్కీమ్: జంగల్ గ్రీన్, బ్లూయిష్ బ్ల్యాక్ పర్ల్3, మీడియం గ్రే, సిల్కీ సిల్వర్ మెటాలిక్ మరియు సుపీరియర్ వైట్.

    మారుతి సుజుకి జిమ్నీ

    సుజుకి జిమ్నీ ఇండియా విడుదల

    2018 సుజుకి జిమ్నీ జూలై 5 న అంతర్జాతీయ విడుదల కానుంది. అయితే, అదే సందర్భంలో ఇండియాలో విడుదల అవుతుందా.... లేదంటే సింగల్‌గానే వస్తుందా అనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, సుజుకి జిమ్నీ ఇండియన్ మార్కెట్లోకి ఖచ్చితంగా విడుదలవుతున్నట్లు తెలిసింది.

    మారుతి సుజుకి జిమ్నీ

    సుజుకి జిమ్నీ ధర అంచనా

    సుజుకి జిన్నీ సుమారుగా రూ. 5.5 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్య అంచనా ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లభించే అవకాశం ఉంది. మారుతి సుజుకి జిమ్నీ ఆఫ్ రోడింగ్ కారును నెక్సా ప్రీమియం షోరూమ్ ద్వారా విక్రయించనుంది.

    మారుతి సుజుకి జిమ్నీ

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    సుజుకి జిమ్నీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇండియాలో జిప్సీ సేల్స్ ఆగిపోయినప్పటి నుండి జిమ్నీ కోసం ఎంతో మంది ఇండియన్స్ ఎదురు చూస్తున్నారు.

    మారుతి సుజుకి జిమ్నీ వెహికల్‌ను పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తే, ఒక కొత్త సెగ్మెంట్లో భారీ విజయంతో నూతన రికార్డులు నెలకొల్పడం ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: The Suzuki Jimny: Top Things To Know About The Most-Awaited Compact-4x4 In India
Story first published: Thursday, June 21, 2018, 13:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X