మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి సుజుకి ఆల్టో, సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి అత్యంత సరసమైన కార్లకు ప్రసిద్దిగాంచింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి వీటి సరసన మరో చిన్న కారును చేర్చడానికి కసరత్తులు ప్రారంభించినట

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో, సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి అత్యంత సరసమైన కార్లకు ప్రసిద్దిగాంచింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి వీటి సరసన మరో చిన్న కారును చేర్చడానికి కసరత్తులు ప్రారంభించినట్లు తెలిసింది.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి సుజుకి ఈ చిన్న కారును అంతర్గతంగా మారుతి వై1కె అనే కోడ్ పేరును ఖరారు చేసింది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న మారుతి ఆల్టో మరియు వ్యాగన్ఆర్ కార్ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి సుజుకి వారి స్మాల్ కారు బహుశా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ మోడల్ కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి కార్ల లైనప్‌లోకి ఒక కొత్త బ్రాండ్ పేరుతో రానున్న ఈ మోడల్ ఫ్లాట్ బానెట్ మరియు కూపే తరహా ప్యూచర్ ఎస్ డిజైన్ శైలిలో రానుంది. మారుతి ఆల్టో కారుతో పోల్చుకుంటే ఈ కొత్త కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండనుంది.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి కార్ల లైనప్‌లోకి ఒక కొత్త బ్రాండ్ పేరుతో రానున్న ఈ మోడల్ ఫ్లాట్ బానెట్ మరియు కూపే తరహా ప్యూచర్ ఎస్ డిజైన్ శైలిలో రానుంది. మారుతి ఆల్టో కారుతో పోల్చుకుంటే ఈ కొత్త కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండనుంది.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి సుజుకి వారి అప్ కమింగ్ స్మాల్ కారు క్రాష్ టెస్టులో మెరుగైన ఫలితాలు సాధించిన తరువాతే విపణిలోకి రానుంది. ఇందులో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు రానున్నాయి.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

మారుతి వై1కే పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న రెనో క్విడ్‌కు సరాసరి పోటీనివ్వనుంది. మారుతి సుజుకి ఇంజనీర్లు వై1కే మోడల్ యొక్క ప్రోటోటైప్‍ను పరీక్షించడానికి సన్నద్దమవుతున్నట్లు తెలిసింది. పరీక్షలు పూర్తి చేసుకుని 2020 నాటికి విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి నుండి వస్తున్న మరో స్మాల్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యంత సరసమైన ప్యాసిజంర్ కార్ల తయారీ సంస్థగా సుపరిచితమైన మారుతి సుజుకి, తమ ఇది వరకటి కార్ల మాదరిగా కాకుండా, కాస్త విభిన్న డిజైన్ శైలిలో, అధునాతన ఫీచర్లు మరియు సఫ్టీ అంశాల మేళవింపుతో వై1కే మోడల్‌ను అభివృద్ది చేస్తోంది. కానీ దీని ధరను ఎలా నిర్ణయిస్తుందనేది కాస్త ఉత్కంఠగా మారింది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki’s New Small Car In The Works — To Be Launched In 2020
Story first published: Thursday, July 19, 2018, 10:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X