మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో విక్రయిస్తున్న అన్ని కార్లలో మరో సేఫ్టీ ఫీచరును పరిచయం చేసింది. అవును భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయంగా విక్రయించే అన్ని మోడళ్లలో టైర్

By Anil Kumar

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో విక్రయిస్తున్న అన్ని కార్లలో మరో సేఫ్టీ ఫీచరును పరిచయం చేసింది. అవును భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయంగా విక్రయించే అన్ని మోడళ్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌ ఫీచర్‌గా అందించింది.

దేశవ్యాప్తంగా మారుతి సుజుకి అధీకృత డీలర్లు విక్రయించే అన్ని మోడళ్లలో కస్టమర్ల ఎంపిక మేరకు, ఈ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఫిట్ చేస్తారు.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ వెహికల్స్ న్యూ స్విఫ్ట్, డిజైర్ మరియు వితారా బ్రిజా కార్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్‌ను అందించింది. అంతే కాకుండా ఈ మూడు మోడళ్లను మారుతి వారి ఐక్రియేషన్ కస్టమైజేషన్ ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన స్టైల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ నిరంతరం నాలుగు చక్రాల్లో ఉన్న ప్రెజర్‌ను పరిశీలిస్తూ ఉంటుంది. టైర్లలో గాలి మోతాదు ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ డ్రైవర్‌కు వార్నింగ్ ఇస్తుంది.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

టైర్లలో కనీసం మోతాదులో గాలి లేకపోతే టైర్లు పగిలిపోయే అవకాశం ఉంది. హై స్పీడులో జరిగే టైర్ల పేలుడు భారీ రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే ప్రస్తుతం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అత్యంత కీలకమైన సేఫ్టీ ఫీచర్‌గా నిలిచింది.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

అయితే, మారుతి సుజుకి ఈ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా కాకుండా ఆప్షనల్‌గా మాత్రమే అందిస్తోంది. అంటే, ఈ ఫీచర్ కావాలనుకునే కస్టమర్లు అదనంగా రూ. 12,990లు చెల్లించి దీనిని ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ ఐదు సెన్సార్లను కలిగి ఉంటుంది. నాలుగు టైర్లలో నాలుగు సెన్సార్లతో పాటు స్పేస్ వీల్‌లో కూడా ఒక సెన్సార్ ఉంటుంది. అన్ని టైర్లకు సంభందించిన గాలి మోతాదు వివరాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా డ్రైవర్‌కు తెలియజేస్తుంది. అంతే కాకుండా డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవర్ టైర్ ప్రెజర్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

హైవే మీద అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్నపుడు టైర్లలో పరిమితికి మించి టైర్ ప్రెజర్ ఉన్నట్లయితే, ఖచ్చితంగా వాహనాన్ని ప్రక్కకు నిలిపి టైర్లు కాస్త చల్లబడే వరకు ఆగాలి. అయితే, పరిమితి కంటే తక్కువ ఉన్నట్లయితే ఇది కూడా ప్రమాదకరమే. కాబట్టి సరైన టైర్ ప్రెజర్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మారుతి సుజుకి కార్లలో అదనపు సేఫ్టీ ఫీచర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లో అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా సుపరిచితమైన మారుతి సుజుకి ఇండియన్ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు సేఫ్టీ ఫీచర్లను జోడిస్తోంది. ఇప్పటికే ఎన్నో ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అందిస్తున్న మారుతి ఇప్పుడు తమ అన్ని వేరియంట్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సేఫ్టీ ఫీచర్‌ను ఆప్షనల్‌గా అందిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Swift, Dzire And Vitara Brezza Gets Additional Safety Feature
Story first published: Saturday, May 19, 2018, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X