2 కోట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న మారుతి

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు సరికొత్త మైలురాయిని సాధించింది. మారుతి సుజుకి దేశీయంగా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసింది.

By Anil Kumar

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు సరికొత్త మైలురాయిని సాధించింది. మారుతి సుజుకి దేశీయంగా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 20 వ మిలియన్ కారును ఉత్పత్తి చేసింది.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

కంపెనీ తొలుత 1983 డిసెంబరులో ఉత్పత్తిని ప్రారంభించింది. సరిగ్గా 34 సంవత్సరాల ఐదు నెలల్లో ఈ మైలురాయిని చేధించింది. గుజరాత్‌లోని నూతన సనంద్ ప్లాంటులో 20వ మిలియన్ కారుగా మారుతి స్విఫ్ట్‌ను తయారు చేసింది.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

సుజుకి మోటార్స్ జపాన్ తరువాత ఈ మైలురాయిని సాధించిన రెండవ దేశం ఇండియా. ఏదేమైనప్పటికీ, జపాన్ రికార్డును ఇండియా బ్రేక్ చేసింది. 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేయడానికి జపాన్‌కు 45 ఏళ్లు పట్టగా, ఇండియా కేవలం 34 ఏళ్లలో ఆ రికార్డును దాటేసింది.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

ఇండియాలో మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన 2 కోట్ల యూనిట్లలో అత్యధికంగా ఆల్టో కార్లు ఉన్నాయి. వీటిలో, 31 లక్షల 70 వేల కార్లతో ఆల్టో మొదటి స్థానంలో, 29 లక్షల 10 యూనిట్లతో మారుతి 800 మరియు 21 లక్షల 60 వేల యూనిట్లతో వ్యాగన్ఆర్ కార్లు వరుసగా రెండు మరియు మూడవ స్థానాల్లో ఉన్నాయి.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

సుజుకి మోటార్స్ తొలుత 1983 డిసెంబరులో ఉత్పత్తిని ప్రారంభించింది. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తొలి ప్రొడక్షన్ మోడల్ మారుతి 800. ఆ తరువాత కాలంలో ఇండో-జపనీస్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో మారుతి సుజుకి సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుండి మార్కెట్లో ఉన్న డిమాండుకు అనుగుణంగా ఎన్నో కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసింది.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

ఈ రోజు మారుతి సుజుకి గుర్గావ్‍‌లోని మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటు మరియు గుజరాత్‌లోని సనంద్ ప్రొడక్షన్ ప్లాంటులో తమ మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. జపనీస్ దిగ్గజం సుజుకి మోటార్స్ 100శాతం అనుభందంతో దేశీయంగా ప్యాసింజర్లను ఉత్పత్తి చేసేందుకు మారుతితో జత కట్టింది.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి 10 లక్షల ఉత్పత్తి మైలురాయిని 1994 మార్చిలో సాధించింది. తరువాత 50 లక్షల ఉత్పత్తిని ఏప్రిల్ 2005లో, కోటి నుండి కోటిన్నర ప్రొడక్షన్ మైలురాయి చాలా వేగంగా మార్చి 2011 నుండి మే 2015 మధ్య కాలంలో చేధించింది. ఇదే క్రమంలో కేవలం మూడేళ్ల కాలంలోనే 2 కోట్ల ప్రొడక్షన్‌ను చేరుకుంది.

2 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి భారతదేశపు అతి పురాతమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ. సుమారుగా 34 ఏళ్ల నుండి దేశీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇండియాలో ఎక్కువ డీలర్లు, సర్వీస్ సెంటర్లు, తయారీ కేంద్రాలు ఉన్న కంపెనీ మారుతి సుజుకి. ప్రస్తుతం 16 మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. వీటిలో ప్రధానంగా ఆల్టో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, సియాజ్ మరియు వితారా బ్రిజా వాహనాలు ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Crosses 20 Million Production Milestone In India
Story first published: Tuesday, June 5, 2018, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X