భారత్‌కు స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ ఖరారు చేసిన మారుతి

Written By:
Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

మారుతి సుజుకి ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌‌పో 2018లో థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వెర్షను విడుదల చేయడానికి ముందే ఆర్ఎస్ హైబ్రిడ్ వెర్షన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టాలనే దీర్ఘాలోచనలో ఉంది. చాలా వరకు కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల కంటే హైబ్రిడ్ మోడళ్ల మీదే దృష్టి సారిస్తున్నాయి.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

అంతే కాకుండా ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్లు అంతగా ప్రసిద్ది చెందలేదు. ఎలక్ట్రిక్ స్విఫ్ట్ కారు కంటే ముందుగా హైబ్రిడ్ వెర్షన్ స్విఫ్ట్ లాంచ్ చేసి ఈ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

మారుతి సుజుకి ఇండియా ఇంజనీరింగ్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ సివి రామన్ మాట్లాడుతూ, "మార్కెట్ మొత్తంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కొంత మేరకు వృద్ది చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారత ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ కార్ల వినియోగాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ కార్ల పరిజ్ఞానంతో పాటు హైబ్రిడ్ కార్ల పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఉన్న ఏకైక హైబ్రిడ్ మోడల్ స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్. దేశీయంగా స్విఫ్ట్ కారు మీద విపరీతమైన ఆదరణ లభిస్తోంది. కాబట్టి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ రాక భారత్‌లో ఎంట్రీ లెవల్ హైబ్రిడ్ కార్లకు బీజం కానుంది.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం పలు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ అనుసంధాం గల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. దీనిని సుజుకి హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్(SHVS) అంటారు.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

SHVSలో ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఇంజన్ రెండూ ఉంటాయి. SHVS ద్వారా తక్కువ ఇంధనంతో అధిక మైలేజ్ మరియు కాలుష్య కారకాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

పూర్తి స్థాయి హైబ్రిడ్ సిస్టమ్‌తో పోల్చుకుంటే SHVS చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా చిన్న చిన్న దూరాలకు మాత్రమే ప్రయాణించవచ్చు. మారుతి ఇప్పటికే, ఎర్టిగా మరియు సియాజ్ కార్లలో SHVS హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని అందించింది. స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ మారుతి నుంటి రానున్న మూడవ హైబ్రిడ్ మోడల్.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

ప్రస్తుతం, ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర డీజల్ ఇంజన్ వేరియంట్లో లభ్యమవుతోంది. కాబట్టి, స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లో SHVS టెక్నాలజీ అందివ్వడంతో ఎలాంటి అవాంతరాలు తలత్తే సమస్యే లేదు.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

మారుతి సుజుకి పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ హైబ్రిడ్ లీటర్‌కు గరిష్టంగా 32కిమీల మైలేజ్ ఇస్తుంది. ఇది, మారుతి వెల్లడించిన స్విఫ్ట్ డీజల్ వేరియంట్ మైలేజ్ 28.4కిమీల కంటే ఎక్కువ. కాబట్టి మైలేజ్ ప్రియులను స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ ఖచ్చితంగా ఆకట్టుకోనుంది.

మారుతి స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. మూడవ తరానికి చెందిన సరికొత్త స్విఫ్ట్ విడుదలతో ఇండియన్ కస్టమర్ల నుండి రెస్పాన్స్ అధికమైంది. ఈ నేపథ్యంలో 32కిమీలు మైలేజ్ స్విఫ్ట్ వస్తే ఫలితాలు తారుమారవ్వడం ఖాయం. కాబట్టి, SHVS టెక్నాలజీని అందివ్వడానికి మారుతి సుజుకి సిద్దంగా ఉంది.

English summary
Read In Telugu: Maruti Suzuki Considering Swift RS Hybrid For India
Story first published: Thursday, March 1, 2018, 10:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark