మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

మారుతి సుజుకి తమ ఆల్టో హ్యాచ్‌బ్యాక్ విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ కారును టూర్ హెచ్1 పేరుతో ట్యాక్సీ వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దమైంది.

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ ఆల్టో హ్యాచ్‌బ్యాక్ విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ కారును టూర్ హెచ్1 పేరుతో ట్యాక్సీ వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దమైంది.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

మారుతి ఆల్టో ట్యాక్సీ వేరియంట్ టూర్ హెచ్1 కు సంభందించిన బ్రోచర్ ఫోటోలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ బ్రోచర్‌లో మారుతి సుజుకి ఆల్టో టూర్ హెచ్1 వేరియంట్లు మరియు వాటిలోని ఫీచర్ల వివరాలు రివీల్ అయ్యాయి.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

డిజైన్ పరంగా మారుతి టూర్ హెచ్1 ముందు వైపున బ్లాక్ బంపర్, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఆల్టో 800 ట్యాక్సీ వేరియంట్ టూర్ హెచ్1 మోడల్‌లో స్టీల్ వీల్స్ ఉన్నాయి.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

మారుతి టూర్ హెచ్1లో ఎయిర్ కండీషనర్ మరియు హీటర్, మ్యాన్యువల్ క్లైమేట్ కంట్రోల్, మ్యాన్యువల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, రిమోట్ ద్వారా ఫ్యూయల్ క్యాప్ మరియు ఫ్రంట్ బానెట్ ఓపెనర్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

ఇది సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ అనే విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. సేఫ్టీ పరంగా మారుతి ఆల్టో టూర్ హెచ్1 ట్యాక్సీ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ ఉంది.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

ట్యాక్సీ వేరియంట్ ఆల్టో 800 కారులో అదే మునుపటి శక్తివంతమైన 799సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 47బిహెచ్‌పి పవర్ మరియు 69ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

బ్రోచర్ ద్వారా రివీల్ అయిన సమాచారం మేరకు ఆల్టో 800 ట్యాక్సీ వేరియంట్ కేవలం పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. మరియు ఇది గరిష్టంగా లీటరుకు 23.59కిమీల మైలేజ్ ఇస్తుందని అందులో పేర్కొన్నారు.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

మారుతి ఆల్టో ట్యాక్సీ వేరియంట్ తరువాత దశలో సీఎన్‌జి ఇంజన్ ఆప్షన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ ఇంజన్‌తో పోల్చుకుంటే పవర్ అవుట్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ట్యాక్సీ వేరియంట్‌లో స్పీడ్ గవర్నర్ ఏర్పాటు చేసి గరిష్ట వేగాన్ని 80కిమీలకు పరిమితం చేశారు.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

ప్రస్తుతం మారుతి సుజుకి టూర్ రేంజ్‌లో నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. అవి, టూర్ హెచ్1 (మారుతి ఆల్టో 800), టూర్ హెచ్2 (మారుతి సెలెరియో), టూర్ వి (మారుతి ఇకో) మరియు టూర్ ఎస్ (మారుతి డిజైర్). ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి విడుదల అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎర్టిగా ట్యాక్సీ రూపంలో అందుబాటులోకి రానుంది.

మారుతి ఆల్టో ట్యాక్సీ మోడల్: వేరియంట్లు, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డిజైర్ టూర్ మోడల్‌తో ఇండియన్ ట్యాక్సీ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి అగ్రగామి సంస్థగా రాణిస్తోంది. మారుతి ప్రస్తుతం విక్రయిస్తున్న ట్యాక్సీ మోడళ్ల సరసన భారతదేశపు చీపెస్ట్ ట్యాక్సీ కారు ఆల్టో 800 మోడల్‌ను టూర్ హెచ్1 పేరుతో విడుదల చేయడానికి సిద్దమైంది.

Source: IAB

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Tour H1 (Alto Taxi) Brochure Leaked — Variants And Features Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X