మొదటిసారి రోడ్డెక్కిన 2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. డిజైన్ మరియు టెక్నాలజీ పరంగా 2018 మారుతి స్విఫ్ట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

By Anil

Recommended Video

Indian Army Soldiers Injured In Helicopter Fall - DriveSpark

మారుతి సుజుకి మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. డిజైన్ మరియు టెక్నాలజీ పరంగా 2018 మారుతి స్విఫ్ట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద మారుతి సుజుకి తమ కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించి, ఆ తరువాత పూర్తి స్థాయిలో విపణిలోకి ప్రవేశపెట్టనుంది.ఈ తరుణంలో, ఎరుపు రంగు బాడీ పెయింట్ స్కీమ్‌లో 2018 స్విఫ్ట్ దిగ్గజ ఆటో మీడియా కంటబడింది.

2018 మారుతి స్విఫ్ట్

ఇప్పటి వరకు రహస్యంగా ఎన్నో దఫాలు మారుతి తమ నూతన స్విఫ్ట్‌ను పరీక్షించింది. అయితే, తాజాగా పట్టుబడిన మారుతి స్విఫ్ట్ ఫోటోలలో చాలా స్పష్టంగా ఉంది. ఫ్రంట్ డిజైన్, సైడ్ మరియు రియర్ డిజైన్ అంశాలను స్పష్టంగా గమనించవచ్చు.

2018 మారుతి స్విఫ్ట్

ఇప్పటి వరకు రహస్యంగా ఎన్నో దఫాలు మారుతి తమ నూతన స్విఫ్ట్‌ను పరీక్షించింది. అయితే, తాజాగా పట్టుబడిన మారుతి స్విఫ్ట్ ఫోటోలలో చాలా స్పష్టంగా ఉంది. ఫ్రంట్ డిజైన్, సైడ్ మరియు రియర్ డిజైన్ అంశాలను స్పష్టంగా గమనించవచ్చు.

2018 మారుతి స్విఫ్ట్

2018 స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్‌లో స్విఫ్ట్ సంప్రదాయాన్ని కొనసాగించే అదే రూపొన్ని కలిగి ఉంది. అయితే, ఆల్ న్యూ పిల్లర్స్, బ్లాక్ అవుట్ రియర్ పిల్లర్, స్లోపింగ్ రూఫ్ డిజైన్, మరియు రియర్ డోర్ హ్యాండిల్‌ను డోర్ ఫ్రేమ్‌లో ఇముడింపజేసింది.

2018 మారుతి స్విఫ్ట్

స్విఫ్ట్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్తగా డిజైన్ చేయబడిన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, మరియు కొద్దిగా రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్ మరియు బంపర్ ఉన్నాయి. అదే విధంగా ప్రస్తుత స్విఫ్ట్ తరహా కాకుండా నెక్సా స్టైల్ బ్యాడ్జింగ్ అందించింది. మారుతి 2018 స్విఫ్ట్‌ను నెక్సాన్ షోరూమ్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి భారీ అంచనాలతో తీసుకొస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా బాలెనో మరియు డిజైర్ కార్లను అభివృద్ది చేసి రూపొందించింది. అధిక ధడత్వం గల స్టీల్ ఉపయోగించి తేలిక బరువు ఉండేలా నిర్మించడం ఈ ఫ్లాట్‌‌ఫామ్ ప్రత్యేకత.

Trending On DriveSpark Telugu:

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంటీరియర్‌ను ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని స్పోర్టివ్ శైలిలో అధునాతన ఫీచర్లను అందించి రూపొందించి. మారుతి గత ఏడాది లాంచ్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ ఇంటీరియర్ నుండి సేకరించిన ఎన్నో అంశాలను ఇందులో పరిచయం చేస్తోంది. అందులో ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి రానున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి సాంకేతికంగా సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ రెండు రకాల ఇంజన్‌ ఆప్షన్‍‌లను అందిస్తోంది. అవి, 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్‌ ఇంజన్‌లు.

2018 మారుతి స్విఫ్ట్

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు వరుసగా 82బిహెచ్‌పి పవర్ మరియు 74బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. 2018 మారుతి స్విఫ్ట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యం కానుంది. భద్రత పరంగా స్విఫ్ట్ లభించే అన్ని వేరియంట్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టిమ్ తప్పనిసరిగా రానుంది.

2018 మారుతి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ ప్యాసింజర్ కార్ల విపణిలో మారుతి స్విఫ్ట్ రోజు రోజుకీ అంచనాలను తీవ్రం చేస్తోంది. ఇటు మీడియాలో... అటు కస్టమర్లలో తీవ్ర ఉత్సాహాన్ని నింపుతోంది. మారుతి స్విఫ్ట్ పూర్తి స్థాయిలో విడుదలైతే భారీ విజయం ఖాయం అని చెప్పవచ్చు. దీని రాకతో విపణిలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో వంటి ప్రధాన హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: TeamBHP

More from DriveSpark

Article Published On: Friday, January 12, 2018, 16:51 [IST]
English summary
Read In Telugu: 2018 Maruti Swift Spotted In India Ahead Of Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+