Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏప్రిల్ 2018లో విడుదలకు సిద్దమైన మహీంద్రా ఎక్స్‌యూవీ
మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500ను అతి త్వరలో సరికొత్త వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమైంది. తాజాగా అందిన సమాచారం మేరకు, పూర్తి స్థాయిలో అప్‌డేట్స్‌కు గురైన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఈ ఏప్రిల్ 2018లో విడుదలవుతున్నట్లు తెలిసింది.

న్యూ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీలో ఫీచర్లు, డిజైన్ మరియు ఇంజన్ పరంగా అప్‌డేట్స్ జరగనున్నాయి. ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు నూతన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో కొత్త బంపర్, నూతన స్టైల్లో టెయిల్ ల్యాంప్స్ మరియు కొన్ని ఎల్ఇడి ఎలిమెంట్స్ ఉన్నాయి.

అప్‌డేటెడ్ వెర్షన్ ఎక్స్‌యూవీ500లో 170బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే సరికొత్త 2.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ రానుంది. మహీంద్రా ఇంటీవల ఎక్స్‌యూవీ500 జి9 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ విడుదల చేసింది. ఇందులో 2.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.


ఫీచర్ల పరంగా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, కనెక్ట్ అప్లికేషన్స్ మరియు ఎకోసెన్స్ ఇంకా ఇతర యాప్స్ సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియమ్ ఫీల్ కలిగించే లెథర్ సీటింగ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో రూపొందించిన డ్యాష్ బోర్డ్ మరియు అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ వంటి ఎస్‌యూవీల నుండి పోటీని ఎదుర్కుంటోంది. అప్‌డేటెడ్ ఎక్స్‌యూవీ500 విడుదలైతే సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి అప్‌డేటెడ్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ ధరల వ్యత్యాసం గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ, పైన పేర్కొన్న పోటీదారులను మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎదుర్కోవడం ఖాయం. ఒక వేళ మీరు కనుక ఎక్స్‌యూవీ500 కొనుగోలు చేస్తున్నట్లయితే, న్యూ వెర్షన్ ఎక్స్‌యూవీ500 కోసం ఒక నెల రోజులు వేచి ఉండండి.