సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి సరికొత్త 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా, దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి నెక్సా ప్రీమియం షోరూముల్లో 2018 సియాజ్ మీద అధికారికంగా బుకింగ్

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా, దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి నెక్సా ప్రీమియం షోరూముల్లో 2018 సియాజ్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్ డిజైన్, నూతన పెట్రోల్ ఇంజన్ మరియు అదనపు ఫీచర్లు పరిచయం అవుతున్నాయి. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, నూతన అల్లాయ్ వీల్స్ మరియు సరికొత్త టెయిల్ గేట్ క్లస్టర్ వంటివి రానున్నాయి.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్‌నే పోలి ఉండనుంది. అయితే, ఇందులో అదనంగా క్రూయిజ్ కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, స్టెబిలిటి కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా రానున్నాయి.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో చోటు చేసుకుంటున్న అతి పెద్ద మార్పు, సరికొత్త పెట్రోల్ ఇంజన్ పరిచయం అవ్వడం. అవును, సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ వస్తోంది.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు ఇది స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇందులో వస్తోంది.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

డీజల్ ప్రియుల కోసం 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ యథావిధిగా అదే మునుపటి 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ వస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

హైబ్రిడ్ టెక్నాలజీ లభ్యమయ్యే భారతదేశపు మొట్టమొదటి సెడాన్ కారు సరికొత్త మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్. ఇది నూతన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ యొక్క మైలేజ్‌ను గణనీయంగా పెంచుతుంది. డిజైన్ పరంగా పాత సియాజ్ మరియు కొత్త ఫేస్‌లిఫ్ట్‌ సియాజ్‌కు మధ్య పెద్ద తేడా లేదు.

 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా పలు మార్పులు చేర్పులతో విడుదలకు సిద్దమైన మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరికొన్ని వారాల్లో విడుదల కానుంది. అత్యాధునిక ఫీచర్లు మరియు నూతన ఇంజన్ పరిచయంతో భారీ అంచనాలను సృష్టిస్తోంది. మారుతి సుజుకి కంపెనీకి భారీ విక్రయాలు సాధించిపెట్టనున్న సియాజ్ సెడాన్ ధరల పరంగా చెప్పుకోదగిన మార్పులమీ ఉండబోవని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Ciaz Facelift Bookings Open — To Be Launched Soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X