2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో అధునాతన సేఫ్టీ ఫీచర్లు

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఈ నెల 20 న తమ సరికొత్త 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఈ నెల 20 న తమ సరికొత్త 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ గురించి రహస్యంగా లీక్ అవుతున్న ఒక్కో విషయం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సియాజ్ అదనపు మరియు నూతన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నట్లు తెలిసింది. అవేంటో చూద్దాం రండి...

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

ప్రస్తుతం అందుబాటులో మారుతి సియాజ్‌లోని అన్ని వేరియంట్లలో కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్లు మాత్రమే తప్పనిసరి ఫీచర్లుగా లభిస్తున్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

కానీ సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ అదే విధంగా డ్రైవర్లకు సీట్ బెల్ట్ వార్నింగ్ వంటివి అన్ని వేరియంట్లలో తప్పనిసరి ఫీచర్లుగా లభించనున్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు వస్తున్నట్లు తెలిసింది. కారు గంటకు 80 నుండి 120 కిలోమీటర్ల మధ్య వేగంతో ప్రయాణిస్తున్నపుడు స్పీడ్ అలర్ట్ సిస్టమ్ ప్రతి 60 సెకండ్లకు రెండుసార్లు అలర్ట్ చేస్తుంది, అయితే గంటకు 120కిమీల వేగంతో ప్రయాణిస్తే నిరంతరాయంగా బీప్ శబ్దాన్నిస్తుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

డిజైన్ పరంగా 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో భారీలు చోటు చేసుకున్నాయి. రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లో ప్రొజెక్టర్ లైట్లు మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. సైడ్ డిజైన్‌లో కొత్తగా వచ్చిన అల్లాయ్ వీల్స్ మినహాయిస్తే మరెలాంటి మార్పులు జరగలేదు.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

ఇంటీరియర్‌లో ప్రపంచ శ్రేణి ప్రీమియం సొబగులు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ల మీద ఉన్న కలపతో తీర్చిదిద్దిన హంగులు, రీడిజైన్ చేయబడిన మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ల్పే ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

సరికొత్త మారుతి సియాజ్‌లో మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో అధునాతన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ పరిచయం అయ్యింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

మారుతి సియాజ్ డీజల్ వేరియంట్లలో అదే మునుపటి శక్తివంతమైన 1.3-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. 88బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో మాత్రమే లభించనుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. భారీ మార్పులు చేర్పులతో వస్తోన్న సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ధరల శ్రేణి రూ. 8 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది విపణిలో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు టయోటా యారిస్ సి-సెగ్మెంట్ సెడాన్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: RushLane

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Ciaz Facelift To Get More Safety Features
Story first published: Sunday, August 19, 2018, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X