న్యూ మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి
భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి సరికొత్త సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను వచ్చే అక్టోబరులో పండుగ సీజన్ ప్రారంభమమ్యేనాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్ డిజైన్ పలు మార్పులతో రానుంది. మారుతి కూడా ఈ సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఫ్రంట్ డిజైన్‌లో కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, నూతన ఫ్రంట్ గ్రిల్ మరియు అధునాతన ఎయిర్ ఇంటేకర్ వంటి సియాజ్ రూపు రేఖలు మార్చేయనున్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా డిజైన్ చేయబడిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది. సియాజ్ సెడాన్ రియర్ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన బంపర్, నూతన టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ మరియు టెయిల్ గేట్ డిజైన్ వంటి అంశాల పరంగా మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

సాంకేతికంగా మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ అధునాతన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇది, అత్యంత మెరుగైన 103.2బిహెచ్‌పి పవర్ మరియు 138.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ 91బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అంతే కాకుండా, ప్రస్తుతం ఉన్న 1.3-లీటర్ డీజల్ ఇంజన్ స్థానంలో కొత్తగా అభివృద్ది చేసిన 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను కాస్త ఆలస్యంగా సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అదే విధంగా డీజల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది.

సరికొత్త మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి, విదేశీ మోడళ్లను ఎదుర్కునేందుకు విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని కలిగించే నూతన డ్యాష్‌బోర్డ్, సీట్ అప్‌హోల్‌స్ట్రే మార్పులతో పాటు పలు నూతన ఫీచర్లు వస్తున్నాయి. నాణ్యమైన మెటీరియల్‌తో తయారైన ఇంటీరియర్, అదనపు భద్రత ఫీచర్లు మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో సత్తా చూపించడానికి మారుతి సుజుకి తమ సియాజ్ కారులో స్వల్ప మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ పండుగ సీజన్ నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు మారుతి కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీవీని కూడా విడుదల చేయనుంది.

సరికొత్త మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్ మరియు అతి త్వరలో విడుదల కాబోయే టయోటా యారిసి వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.
Source: GaadiWaadi


Click it and Unblock the Notifications








