సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌తో మరో ప్రయోగానికి సిద్దమైన మారుతి

Written By:
Recommended Video - Watch Now!
Toyota Yaris India Walkaround; Specifications, Features, Details

మారుతి సుజుకి ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో ఫేస్‌లిఫ్ట్ సియాజ్ మిడ్ సైజ్ సెడాన్ కారును ఆవిష్కరిస్తుందని ఆశించాం. అయితే, మూడవ తరం 2018 స్విఫ్ట్ విడుదల నేపథ్యంలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ మీద దృష్టి సారించలేదు.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, సరికొత్త సియాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలను ఆగష్టు 2018 నాటికి షెడ్యూల్ చేసినట్లు తెలిసింది. కొత్త తరం సియాజ్ బుకింగ్స్ జూలై 2018 నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మిడ్ సైజ్ సెడాన్‌లో వస్తున్న అతి ముఖ్యమైన మార్పు సరికొత్త డీజల్ ఇంజన్ పరిచయం కావడం. అవును, మారుతి తమ ఫేస్‌లిఫ్ట్ సియాజ్‌లో సరికొత్త 1.5-లీటర్ డీజల్ ఇంజన్ అందివ్వనుంది.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సియాజ్‌ 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. చాలా వరకు మారుతి కార్లలో ఫియట్ నుండి సేకరిచిన 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఉంది. అతి త్వరలో మారుతి ఈ 1.3 లీటర్ నుండి తమ లైనప్ నుండి తొలగించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

సుజుకి ఇంజనీరింగ్ బృందం స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన 1.5-లీటర్ ఇంజన్‌నే వినియోగించనుంది. అంతే కాకుండా పెట్రోల్ ఇంజన్‌ను కూడా 1.5-లీటర్‌కు అప్‌‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

చూడటానికి ఫేస్‌లిఫ్ట్ సియాజ్ ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్ పరంగా కూడా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం, మారుతి సియాజ్ ధరల శ్రేణి రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల ఉంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సియాజ్ మరియు రెగ్యులర్ వెర్షన్ సియాజ్ ధరల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

గత కొన్నేళ్ల నుండి ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ బాగా పుంజుకుంది. దీంతో సెడాన్ సెగ్మెంట్ తన పట్టును కోల్పోతోంది. అయినప్పటకీ, హోండా మరియు హ్యుందాయ్ వంటి కార్ల తయారీ సంస్థలు సిటీ మరియు వెర్నా కార్లను తీసుకొచ్చాయి.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సియాజ్ మొట్టమొదటి సారిగా 2014లో మార్కెట్లోకి విడుదలైంది. అప్పటి నుండి ఎలాంటి అప్‌డేట్స్ జరగలేదు. అయితే, డిజైన్, ఇంజన్ మరియు ఇంటీరియర్ పరంగా మార్పులు చేర్పులతో రానున్న సరికొత్త మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా సరికొత్త యారిస్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గత ఏడాది హోండా మరియు హ్యుందాయ్ తమ అప్‌డేటెడ్ సిటీ మరియు వెర్నా కార్లను లాంచ్ చేశాయి. సిటీ మరియు వెర్నా రెండింటిలో కూడా శక్తివంతమైన ఇంజన్‌లు ఉన్నాయి. అయితే, సియాజ్‌లో శక్తివంతమైన ఇంజన్ మరియు ఫీచర్లు రెండూ లేవు.

మారుతి తాజా నిర్ణయంతో, సియాజ్ ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో మరియు క్లాస్ లీడింగ్ ఇంటీరియర్ ఫీచర్లతో రానుంది.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

రెనో డస్టర్ మీద లక్ష రుపాయల తగ్గిన ధర

భారత్‌కు స్విఫ్ట్ ఆర్ఎస్ హైబ్రిడ్ ఖరారు చేసిన మారుతి: ఇకపై మైలేజే... మైలేజ్...!!

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి ఎందుకో తెలుసా...?

Source: Times Of India

English summary
Read In Telugu: New Maruti Ciaz Facelift Launch In India: To Get New Diesel Engine
Story first published: Friday, March 2, 2018, 13:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark