2018 మారుతి సియాజ్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, వేరియంట్లు మరియు మైలేజ్
2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ నేడు ( 20 ఆగష్టు, 2018) విపణిలోకి విడుదలయ్యింది. దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి సరికొత్త 2018 సియాజ్ సెడాన్ కారును విడుదల చేసింది
2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ నేడు ( 20 ఆగష్టు, 2018) విపణిలోకి విడుదలయ్యింది. దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి సరికొత్త 2018 సియాజ్ సెడాన్ కారును విడుదల చేసింది. మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 8.19 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ లభించే వేరియంట్లు, ఫీచర్లు, ధరలు మరియు ఇతర వివరాల గురించి పూర్తి వివరాలు కోసం...

వేరియంట్లు
2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, సిగ్మా, డెల్టా, జెటా మరియు అల్ఫా. సియాజ్ సిగ్మా పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.19 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ సియాజ్ ఆల్ఫా డీజల్ ధర రూ. 10.97 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

వేరియంట్ల వారీగా ధరలు
| Variant | Petrol | Diesel |
| Sigma | Rs 8,19,000 | Rs 9,19,000 |
| Delta | Rs 8,80,000 | Rs 9,80,000 |
| Delta AT | Rs 9,80,000 | NA |
| Zeta | Rs 9,57,000 | Rs 10,57,000 |
| Zeta AT | Rs 10,57,000 | NA |
| Alpha | Rs 9,97,000 | Rs 10,97,000 |
| Alpha AT | Rs 10,97,000 | NA |
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

డిజైన్
పాత సియాజ్ మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు జరిగాయి. మారుతి సియాజ్‌లో ముందువైపున క్రోమ్ స్ట్రిప్స్ ఉన్న మల్టీపిక్సెల్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు మరియు ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్లు జోడింపుతో వచ్చిన అధునాతన హెడ్‌ల్యాంప్స్, సిల్వర్ మేళవింపులతో కూడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు సరికొత్త స్పోర్టివ్ బంపర్ వంటివి ఉన్నాయి.

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, 15-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ చోటు చేసుకోలేదు. సియాజ్ ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌లో కొద్దిగా మార్పుకు గురైన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు కొత్తగా డిజైన్ చేయబడిన బంపర్ ఉన్నాయి.

లభించే రంగులు
మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఏడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, నెక్సా బ్లూ, మెటాలిక్ మాగ్మా గ్రే, పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, పర్ల్ శాంగ్రియా రెడ్, పర్ల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్, మెటాలిక్ ప్రీమియం సిల్వర్ మరియు పర్ల్ స్నో వైట్.

ఇంటీరియర్ మరియు ఫీచర్లు
సరికొత్త మారుతి సియాజ్ ఇంటీరియర్ మొత్తం పాత మోడల్‌నే పోలి ఉంది. అయితే, డ్యాష్‌బోర్డు మరియు డోర్ల మీద కలపతో కూడిన హంగులు, నూతన స్టీరింగ్ మరియు అప్‌హోల్‌స్ట్రే కొత్తగా ఉన్నాయి.

2018 మారుతి సియాజ్ ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు సుజుకి కనెక్ట్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్ సపోర్ట్ చేసే సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టీఎఫ్‌టీ కలర్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ల్పే గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత
మారుతి సుజుకి తమ సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో భద్రత పరంగా అద్భుతమే చేసిందని చెప్పాలి. మునుపటి సియాజ్‌తో పోల్చితే ఇందులో ఎన్నో సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి. అందులో, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
సియాజ్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్
మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వెర్షన్‌లో సరికొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ పెట్రోల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ జోడింపుతో లభిస్తోంది. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ బ్రేకులు అప్లే చేసినపుడు ఉత్పత్తి అయ్యే పవర్‌ను నిల్వ చేసుకుని, ఎలక్ట్రిక్ మోటార్‌కు సరఫరా చేస్తుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ డీజల్ వెర్షన్‌లో అదే మునుపటి 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 88బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో మాత్రమే లభ్యమవుతోంది. సియాజ్ డీజల్ వేరియంట్లో కూడా మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కలదు.

మైలేజ్
పెట్రోల్ ఇంజన్-హైబ్రిడ్ కాంబినేషన్‌లో వచ్చిన మొట్టమొదటి సెడాన్ మారుతి సియాజ్, ఇది ఇంజన్ యొక్క మైలేజ్‌ను గణనీయంగా పెంచింది. ఏఆర్ఏఐ మేరకు సియాజ్ పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 21.56కిమీలు మరియు సియాజ్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 20.28కిమీలు అదే విధంగా సియాజ్ డీజల్ మైలేజ్ 24కిలోమీటర్లుగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి సుజుకి ఎట్టకేలకు విపణిలోకి సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేసింది. ఇందులో పాత 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో సరికొత్త 1.5-లీటర్ ఇంజన్ రావడం, డీజల్ మరియు పెట్రోల్ వేరియంట్లలో హైబ్రిడ్ టెక్నాలజీ పరిచయం అవ్వడం అదే విధంగా అధునాతన సేఫ్టీ ఫీచర్లు రావడాన్ని ప్రధాన హైలెట్‌గా చెప్పవచ్చు.
మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ విపణిలో ఉన్న హోండా సిటీ, టయోటా యారిస్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.


Click it and Unblock the Notifications








