ప్రస్తుతానికి టీజర్‌తో సరిపెట్టిన మారుతి సుజుకి

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి కొత్త తరం సియాజ్ సెడాన్ కారును విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో అప్‌డేటెడ్ వెర్షన్ సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మిడ్-సైజ్ సెడాన్ కారు

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి కొత్త తరం సియాజ్ సెడాన్ కారును విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో అప్‌డేటెడ్ వెర్షన్ సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మిడ్-సైజ్ సెడాన్ కారు టీజర్‌ను తాజాగా రివీల్ చేసింది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సి-సెగ్మెంట్ సెడాన్ కారు యొక్క చలన చిత్ర ప్రకటనకు సంభందించిన ఓ టీజర్‌ను రివీల్ చేసింది. ఇందులో సియాజ్ ప్రీమియం సెడాన్ యొక్క ఫ్రంట్ డిజైన్, హెడ్ లైట్లను చూపించింది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారుకు ఇండియన్ రోడ్ల మీద కఠినమైన పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు పూర్తి చేసుకున్న సియాజ్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ ఆగష్టు 2018లో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలవనున్నట్లు సమాచారం.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

తాజాగా రివీల్ అయిన టీజర్‌లో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న పలుచటి హెడ్‌ల్యాంప్స్ మరియు హనీకాంబ్ ట్రీట్‌మెంట్ గల ఫ్రంట్ గ్రిల్ కీలకంగా నిలిచాయి. ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్ ల్యాంప్ మినహాయిస్తే ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదనిపిస్తోంది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో వస్తోన్న మరో కీలకమైన మార్పు నూతన పెట్రోల్ ఇంజన్ పరిచయం. అవును, ఇది వరకు ఉండే 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని 1.5-లీటర్ కెపాసిటి గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ భర్తీ చేయనుంది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ నూతన పెట్రోల్ ఇంజన్ సుజుకి వారి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ జోడింపుతో రానుంది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

పెట్రోల్ ఇంజన్‌కు కొనసాగింపుగా, అదే మునుపటి 1.3-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో మాత్రమే లభ్యం కానుంది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ మీద అధికారిక బుకింగ్స్ అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ధరలు విషయానికి వస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవే పాత ధరలతో లభ్యం కానుంది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి గత నాలుగైదు నెలలుగా సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును పలు దఫాలుగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. ఇప్పుడు పరీక్షలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారు యొక్క చలన చిత్ర ప్రకటన కోసం షూటింగ్ పూర్తి చేసింది. అందులో భాగంగానే ఓ టీజర్‌ను రివీల్ చేసింది.

సియాజ్ టీజర్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న హోండా సిటీ, టయోటా యారిస్, స్కోడా ర్యాపిడ్, హ్యుందాయ్ వెర్నా మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Ciaz Facelift Teased Ahead Of Launch
Story first published: Monday, July 23, 2018, 18:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X