కొత్త సియాజ్ మరియు పాత సియాజ్‌కు మధ్య తేడా ఏంటి?

మారుతి సుజుకి సరికొత్త 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. పలుదఫాలుగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును ఆగష్

By Anil Kumar

మారుతి సుజుకి సరికొత్త 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. పలుదఫాలుగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును ఆగష్టు 20, 2018 న విడుదల చేయడానికి మారుతి కసరత్తులు ప్రారంభించింది.

అయితే, పాత మారుతి సియాజ్ మరియు నూతన 2018 మారుతి సియాజ్ మధ్య తేడా ఏంటో ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

2018 మారుతి సియాజ్

డిజైన్

పాత సియాజ్‌తో పోల్చుకుంటే సరికొత్త 2018 సియాజ్ ఖరీదైన కారుగా కనిపిస్తుంది. సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, స్వల్పంగా మారిన ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ డిజైన్ మరియు సరికొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కలదు.

2018 మారుతి సియాజ్

2018 మారుతి సియాజ్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే, నూతన అల్లాయ్ వీల్స్ మినహాయిస్తే గుర్తించదగిన మార్పులేమీ పెద్దగా చోటు చేసుకోలేదు. సియాజ్ ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌లో సరికొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు స్పోర్టివ్ బంపర్ ఉన్నాయి.

2018 మారుతి సియాజ్

ఇంటీరియర్

సరికొత్త 2018 మారుతి సుజుకి సియాజ్ ఇంటీరియర్ పాత సియాజ్ ఇంటీరియర్‌నే పోలి ఉంది. క్యాబిన్ ముందు వైపున్న ఓవరాల్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ పాత సియాజ్ తరహాలోనే ఉంటుంది. కానీ, సీట్ అప్‌హోల్‌స్ట్రే ఎంతో విలాసంగా ఉంది, అదే విధంగా డ్యాష్‌బోర్డు మరియు డోర్లకు లోపలి వైపున కలప సొబగులు వచ్చాయి.

2018 మారుతి సియాజ్

ఫీచర్లు

పాత సియాజ్ కారుతో పోల్చుకుంటే సరికొత్త మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో పలు నూతన ఫీచర్లు పరిచయం అయ్యాయి. ఇందులో, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ మరియు లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే వంటివి ఉన్నాయి.

2018 మారుతి సియాజ్

భద్రత

మారుతి సుజుకి తమ 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి. అయితే, టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి.

2018 మారుతి సియాజ్

ఇంజన్ వివరాలు

సరికొత్త మారుతి సియాజ్‌లో మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో అధునాతన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ పరిచయం అయ్యింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 మారుతి సియాజ్

మారుతి సియాజ్ డీజల్ వేరియంట్లలో అదే మునుపటి శక్తివంతమైన 1.3-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. 88బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో మాత్రమే లభించనుంది.

2018 మారుతి సియాజ్

హైబ్రిడ్ టెక్నాలజీ

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా సుజుకి వారి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వస్తోంది. పెట్రోల్-మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న మొదటి మోడల్ మారుతి సియాజ్.

పెట్రోల్ వేరియంట్ లీటరుకు 18కిలోమీటర్లు మరియు డీజల్‌ వేరియంట్ లీటరుకు సుమారు 24కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

2018 మారుతి సియాజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. భారీ మార్పులు చేర్పులతో వస్తోన్న సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ధరల శ్రేణి రూ. 8 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది విపణిలో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు టయోటా యారిస్ సి-సెగ్మెంట్ సెడాన్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

Images courtesy Dileep Baria

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Ciaz 2018 Vs Old Ciaz: What Is The Difference?
Story first published: Saturday, August 18, 2018, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X