మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్: ఇవీ ప్రత్యేకతలు!!

ఈ ఏడాది దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త కారును కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మారుతి సుజుకి తమ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేసింది.

By Anil Kumar

మారుతి సుజుకి డిజైర్ కారు భారతదేశపు మరియు మారుతి సుజుకి యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా రాణిస్తోంది. మారుతి డిజైర్ సేల్స్ పెంచుకోవడానికి స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త కారును కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మారుతి సుజుకి తమ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేసింది.

అదనపు ఫీచర్లు మరియు సొబగులు కోరుకునే కస్టమర్ల కోసం విడుదలైన మారుతి సుజుకి డిజైర్ స్పెషల్ ఎడిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

2018 మారుతి సుజుకి డిజైర్ స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్లలో లభ్యమవుతోంది. డిజైర్ స్పెషల్ ఎడిషన్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.55 లక్షలు మరియు డీజల్ ఎల్‌డిఐ వేరియంట్ ధర రూ. 6.55 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

డిజైర్ కార్లను ఎంచుకోవాలనుకునే మధ్యతరగతి కస్టమర్లు మరియు తక్కువ బడ్జెట్‌లో కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని డిజైర్ స్పెషల్ ఎడిషన్ కారును కేవలం ఎల్‌డిఐ మరియు ఎల్ఎక్స్ఐ ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మాత్రమే విడుదల చేసింది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

మరి ఈ పరిమిత సంఖ్యలో లభించే ఈ స్పెషల్ ఎడిషన్ డిజైర్ కారులో ఏయే ప్రత్యేకతలున్నాయో చూద్దాం రండి... 2018 మారుతి డిజైర్‌లో 2-స్పీకర్ బ్లూటూత్ స్టీరియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ పవర్ విండోస్, ఆకర్షణీయైన వీల్ కవర్ మరియు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించింది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

సుజుకి వారి నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన మారుతి న్యూ డిజైర్ మునుపటి మోడల్ కంటే చాలా విశాలంగా, వెడల్పుగా మరియు పొట్టిగా ఉంటుంది. అంతే కాకుండా సెకండ్ జనరేషన్ డిజైర్‌తో పోల్చుకుంటే ఈ థర్డ్ జనరేషన్ డిజైర్ బరువు చాలా తక్కువగా ఉంది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభించే కొత్త తరం మారుతి డిజైర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

సరికొత్త మారుతి డిజైర్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ పరంగా భారీ మార్పులకు గురయ్యింది. మరియు మారుతి ఇప్పటి వరకు పరిచయం చేయనటువంటి ఎన్నో నూతన ఫీచర్లను మరియు చాలా వరకు సేఫ్టీ ఫీచర్లను దాదాపు అన్ని వేరియంట్లలో తప్పనిసరి చేసింది. దీంతో మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కనీవిని ఎరుగని ఫలితాలు సాధిస్తోంది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

కంపెనీ వివరాల మేరకు, మారుతి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 22 కిలోమీటర్లు మరియు 1.3-లీటర్ డీజల్ వేరియంట్ 28.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నాయి. మారుతి డిజైర్ ఇప్పుడు భారతదేశపు అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా నిలిచింది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మారుతి సుజుకి కంపెనీకి విపరీతమైన ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, డిమాండ్ తగ్గ ఉత్పత్తిని చేపట్టేందుకు సుమారుగా 2,500 కోట్ల రుపాయల పెట్టుబడితో గుజరాత్‌ ప్లాంటులోని ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచేందకు మారుతి సుజుకి ఇండియా సిద్దమవుతోంది.

మారుతి డిజైర్ స్పెషల్ ఎడిషన్

అంతే కాకుండా, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్న మారుతి సుజుకి, కర్ణాటకలో ఉన్న బిడది టయోటా ప్రొడక్షన్ ప్లాంటులో మారుతి బాలెనో మరియు మారుతి వితారా బ్రిజా కార్ల తయారీ చేపట్టేందుకు మరో 7000 కోట్ల రుపాయల పెట్టబడి పెట్టడానికి ముందుకొచ్చింది.

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Dzire Edition Launched
Story first published: Saturday, August 11, 2018, 14:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X