2018 మారుతి ఎర్టిగా కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి తమ మోస్ట్ పాపులర్ ఎమ్‌పీవీ కొత్త తరం ఎర్టిగా కారును ప్రపంచ ఆవిష్కరణ చేసింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షో 2018లో మారుతి తమ సరికత్త 2018 ఎర్టిగా ఎమ్‌పీవీని ప్రదర్శించింది

By Anil Kumar

మారుతి సుజుకి తమ మోస్ట్ పాపులర్ ఎమ్‌పీవీ కొత్త తరం ఎర్టిగా కారును ప్రపంచ ఆవిష్కరణ చేసింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షో 2018లో మారుతి తమ సరికత్త 2018 ఎర్టిగా ఎమ్‌పీవీని ప్రదర్శించింది. పాత తరం ఎర్టిగాతో పోల్చితే, ఈ కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీని అధునాతన డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

2018 మారుతి ఎర్టిగా

నూతన మారుతి ఎర్టిగా కొలతలు, పొడవు 4,395ఎమ్ఎమ్, ఎత్తు ,735ఎమ్ఎమ్ మరియు వెడల్పు 1690ఎమ్ఎమ్‌గా ఉంది. పాత ఎర్టిగాతో పోల్చుకుంటే వెడల్పు 40ఎమ్ఎమ్ వరకు మరియు ఎత్తు 5ఎమ్ఎమ్ వరకు పెరిగింది.

2018 మారుతి ఎర్టిగా

మారుతి సుజుకి ఈ సరికొత్త 2018 ఎర్టిగా ఎమ్‌పీవీని అధునాతన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. ఇదే ఫ్లాట‌్‌ఫామ్ మీద మారుతి లైనప్‌లో ఉన్న నూతన స్విఫ్ట్, డిజైర్, బాలెనో మరియు ఇగ్నిస్ కార్లను నిర్మించారు.

2018 మారుతి ఎర్టిగా

మారుతి ఎర్టిగా ఫ్రంట్ ప్రొఫైల్‌లో క్రోమ్‌తో నిండిన ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా హెడ్‌ల్యాంప్స్, త్రిభుజాకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ గల సరికొత్త డిజైన్‌లో ఉన్న బంపర్, మరియు సెంటర్ ఎయిర్ ఇంటేకటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా రియర్ డిజైన్‌లో ఎల్-ఆకారంలో ఉన్న టెయిల్ లైట్లు ఉన్నాయి.

2018 మారుతి ఎర్టిగా

కొత్త తరం మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ ఇంటీరియర్‌లో లైట్ బీజి కలర్ ఫినిషింగ్ కలదు. ఫాక్స్ వుడ్ తొడుగులు మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఎర్టిగా లోపలి వైపున రియర్ ప్యాసింజర్ల కోసం రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, పాత ఎర్టిగాలో ఉన్నటువంటి, మధ్య సీటును 60:40 నిష్పత్తిలో మరియు చివరి సీటును 50:50 నిష్పత్తిలో మడిపేసే అవకాశం ఉంది.

2018 మారుతి ఎర్టిగా

రెండవ తరానికి చెందిన ఎర్టిగా ఎమ్‌పీవీలో చివరి వరుస సీటును మడిపేయడం ద్వారా 18 లీటర్లు పెరిగి మొత్తం 153 లీటర్ల ఢిక్కీ స్పేస్ కలిగి ఉంది. పాత జనరేషన్ ఎర్టిగాతో పోల్చుకుంటే ఈ కొత్త ఎమ్‌పీవీలో క్యాబిన్ స్పేస్ గణనీయంగా పెరగనుంది. కొలతల పరంగా కూడా 2018 మారుతి ఎర్టిగానే పెద్దది.

2018 మారుతి ఎర్టిగా

మారుతి సుజుకి న్యూ జనరేషన్ ఎర్టిగా ఎమ్‌పీవీ ఫీచర్ల విషయానికి వస్తే, బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, సరికొత్త లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, కలప సొబగులు ఉన్న ఆర్నమెంట్స్ మరియు టిల్ట్ ఫంక్షన్ గల స్టీరింగ్ వీల్, నూతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ మరియు సీట్ హైట్ అడ్జెస్ట్‌మెంట్ వంటివి కలవు.

2018 మారుతి ఎర్టిగా

భద్రత పరంగా కొత్త తరం మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 మారుతి ఎర్టిగా

సాంకేతికంగా, ఇండోనేషియా వేరియంట్ ఎర్టిగా మోడల్‌లో 1.5-లీటర్ కెపాసిటి గల కె15బి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది 102బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా ఇండియన్ వెర్షన్ 1.3-లీటర్ డీజల్ ఇంజన్ యథావిధిగా అదే 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యంకానుంది.

2018 మారుతి ఎర్టిగా

1.విపణిలోకి 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ విడుదల

2.నార్టన్ కమాండో 961 కఫే రేసర్ విడుదల: ధర రూ. 23 లక్షలు

3.ఇక మీదట బైకులకు కూడా ఫ్యాన్సీ నెంబర్లు: ప్రారంభ ధర రూ. 15,000 లు

4.మారుతి సుజుకి తరువాత విడుదల చేసే కారు ఇదే

5.బాలెనో ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Ertiga 2018 Unveiled; Expected Launch Date, Specifications, Features & Images
Story first published: Friday, April 20, 2018, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X