మారుతి నుండి మరో కొత్త ఎస్‌యూవీ: పూర్తి వివరాలు!!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ నగర వేదికగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద కొత్త కార్లను ఆవిష్కరించడానికి సిద్దమైంది.

By Anil

Recommended Video

Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ నగర వేదికగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద కొత్త కార్లను ఆవిష్కరించడానికి సిద్దమైంది.

సరికొత్త డిజైన్ ఫిలాసఫీలో కొత్త ఉత్పత్తులను కాన్సెప్ట్ దశలో పరిచయం చేయనుంది. అందులో ఒకటి మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యీవీ.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఇండో-జపనీస్ భాగస్వామ్యం మారుతి సుజుకి రెనో క్విడ్ స్మాల్ కారుకు పోటీగా కొత్త కారును, మరియు ఈ మధ్య కాలంలో అధిక ఆదరణ లభిస్తున్న కార్లకు అనుగుణమైన మోడళ్లను తీసుకొచ్చేందుకు మారుతి ప్రయత్నిస్తోంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి విడుదల చేసిన ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ప్రకారం, విశాలమైన క్యాబిన్, నూతన డిజైన్ లాంగ్వేజ్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ అంశాలను గుర్తించవచ్చు. ఇప్పటి వరకు మారుతి విక్రయించిన మరియు పరీక్షించిన కార్లలో ఇలాంటిది అస్సలు లేదు. ఇది కంప్లీట్‌గా కొత్తది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి సుజుకి సీనియర్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ సివి రామన్ మాట్లాడుతూ, "ఈ అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీ క్రింది స్థానంలో నిలవనుందని, ఈ సెగ్మెంట్ ఆధారంగానే భవిష్యత్తులో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపాడు."

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

"అయితే, మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీ కన్నా ఎంత వరకు తక్కువ శ్రేణిలో కాంపాక్ట్ ఎస్‌యూవీ పరిచయం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాము. వీలైనంత తక్కువ ధరలోనే ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

స్మాల్ కార్ సెగ్మెంట్లో రెనో క్విడ్ అత్యంత పాపులారిటీని సొంతం చేసుకుంది. సేల్స్ మరియు రెవెన్యూ పరంగా సంస్థకు మంచి ఫలితాలు సాధించిపెట్టింది. సౌకర్యవంతమైన ఫీచర్లు, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు ఎస్‌యూవీ తరహా డిజైన్ ఇందుకు కలిసొచ్చిన అంశాలు.

Trending On DriveSpark Telugu:

భారత్‌లో అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో

ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న కొత్త కార్ మరియు బైక్ కంపెనీలు

సరదా కోసం చేసిన బైక్ రైడ్‌లో 11 ఏళ్ల చిన్నారిని చంపేశాడు, చితకబాదిన గ్రామస్థులు

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

అంతే కాకుండా, గత నాలుగైదేళ్ల నుండి దేశీయంగా ఎస్‍‌యూవీ తరహా ఉత్పత్తులు మరియు ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ లభిస్తోంది. కాబట్టి ఎస్‌యూవీ ట్రెండ్ సొంతం చేసుకునేందుకు ఎస్‌యూవీ స్టైల్లో రూపొందించిన మోడళ్ల మీద మారుతి దృష్టి సారిస్తోంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ ఫోటోను పరిశీలిస్తే, చిన్న సైజు వితారా బ్రిజాను కేవలం బ్రిజా పేరుతోనే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆల్టో స్థానంలోకి పూర్తి స్థాయి ఎస్‌యూవీ తరహా స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేయాలని కూడా మారుతి భావిస్తోంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి సుజుకి ఈ ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌‌యూవీని 2019 నాటికి పూర్తి స్థాయిలో లాంచ్ చేయనుంది. తక్కువ ధరతో అందుబాటులో ఉంచేందుకు పూర్తి స్థాయిలో దేశీయంగానే తయారుచేయనుంది. రిచ్ ఫీలింగ్ కల్పించే ఇంటీరియర్ మరియు రాజీలేని మైలేజ్ ప్రత్యేకతలుగా వస్తున్నాయి.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఈ ఏడాదిలో కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మరో మూడు మోడళ్లను లాంచ్ చేయనుంది. అందులో సరికొత్త వ్యాగన్ఆర్, ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మరియు సియాజ్ ఫేస్‌లిఫ్ట్. ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ మోడల్‌తో ప్రీమియమ్ కార్లను ఉత్పత్తి చేసే కంపెనీల జాబితాలోకి మారుతి చేరనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించే అన్ని కార్ల కవరేజీని తెలుగు పాఠకుల కోసం తీసుకొస్తోంది. తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం మాతో కలిసి ఉండండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki To Unveil Future S Compact SUV Concept At The 2018 Auto Expo — To Rival Renault Kwid
Story first published: Monday, January 8, 2018, 20:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X