కొత్త తరం మారుతి ఆల్టో విడుదలకు ఏర్పాట్లు ముమ్మరం

బెస్ట్ సెల్లింగ్ ఆల్టో కారును సరికొత్త జనరేషన్‌లో భారీ మార్పులు చేర్పులతో విడుదల చేయడానికి అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

By Anil Kumar

భారతదేశపు మోస్ట్ పాపులర్ మరియు బెస్ట్ సెల్లింగ్ ఆల్టో కారును సరికొత్త జనరేషన్‌లో భారీ మార్పులు చేర్పులతో విడుదల చేయడానికి అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాత ఉత్పత్తుల స్థానంలో అప్‌డేటెడ్ మోడళ్లను ప్రవేశపెట్టే ప్రక్షాలనలో భాగంగా మారుతి తమ ఆల్టో స్థానంలో కొత్త తరం ఆల్టో కారును విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

కొత్త తరం మారుతి ఆల్టో

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్టో స్థానంలోకి న్యూ జనరేషన్ ఆల్టో కారును ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో కొత్త తరం ఆల్టో విడుదల చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది. భారీ అంచనాలతో, అనేక మార్పులతో సిద్దమైన ఆల్టో గురించి మరెన్నో వివరాలు ఇవాళ్టి కథనంలో...

కొత్త తరం మారుతి ఆల్టో

విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి ఆల్టో ఒకటి. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మారుతి ఆల్టో 35 లక్షల యూనిట్ల రికార్డ్ సేల్స్ జరిపింది.

కొత్త తరం మారుతి ఆల్టో

తాజాగా అందిన సమాచారం మేరకు, కొత్త తరం మారుతి ఆల్టో కారు అతి త్వరలో కేంద్ర ప్రవేశపెట్టనున్న న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రాం(BNVSAP) వారి భద్రత ప్రమాణాలను పాటిస్తుందని తెలిసింది.

కొత్త తరం మారుతి ఆల్టో

ఈ ప్రోగ్రాం క్రింద ఇండియాలో అమ్ముడయ్యే ప్రతి కారుకు భద్రత పరీక్షలు నిర్వహించాల్సిందే. BNVSAP భద్రతా ప్రమాణాలను పాటించే ప్యాసింజర్ కార్లను మాత్రమే ఇండియాలో విడుదలకు అనుతిస్తారు. వెహికల్ భద్రత పనితీరు మరియు క్రాష్ టెస్ట్ ఫలితాల ఆధారంగా సేఫ్టీ రేటింగ్స్ ఖరారు చేస్తారు.

కొత్త తరం మారుతి ఆల్టో

భద్రత మాత్రమే కాకుండా, 2020 నాటికి బిఎస్-IV వాహనాలకు గడువు కూడా తీరిపోనుంది. ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న ఆల్టో ఈ రెండు ప్రమాణాలను పాటించలేకపోతోంది. అయితే, వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతున్న ఆల్టో భద్రత మరియు ఉద్గార ప్రమాణాలను తూ.చ. తప్పకుండా పాటించనుంది.

కొత్త తరం మారుతి ఆల్టో

ప్రస్తుతం ఆల్టోతో పోల్చుకుంటే కొత్త తరం ఆల్టో డిజైన్ పరంగా పూర్తిగా మారిపోతుంది. జపాన్ మార్కెట్లో ఉన్న ఆల్టో తరహా డిజైన్ లక్షణాలతో ఇండియన్ వెర్షన్ న్యూ ఆల్టో డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఈ ఏడాది ప్రారంభంలో మారుతి ఆవిష్కరించిన ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ డిజైన్ ప్రేరణతో కూడా ఆల్టో ను డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది.

కొత్త తరం మారుతి ఆల్టో

సరికొత్త డిజైన్‌తో పాటు కొత్త తరం ఆల్టో హ్యాచ్‌బ్యాక్ కారులో మరెన్నో అత్యాధునిక ఫీచర్లు రానున్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఎలక్ట్రిక్ పవర్ విండోస్ మరియు ఎలక్ట్రిక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటివి లిస్టులో ఉన్నాయి.

కొత్త తరం మారుతి ఆల్టో

ఏదేమైనప్పటికీ, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే స్టాండర్డ్ ఫీచర్లుగా రానున్నాయి.

కొత్త తరం మారుతి ఆల్టో

సరికొత్త మారుతి ఆల్టో కారులో ప్రస్తుతం ఆల్టో కె10లో ఉన్న అదే మునుపటి 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ రానుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్న ఇది గరిష్టంగా 67బిహెచ్‍‌‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కొత్త తరం మారుతి ఆల్టో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లోని అన్ని పాత ఉత్పత్తుల ప్రక్షాళన చేపడుతోంది. ఆల్టో స్థానంలో కొత్త తరం ఆల్టో కారుతో పాటు, నూతన సియాజ్ సెడాన్, ఫేస్‌లిఫ్ట్ ఎర్టిగా ఎమ్‌పీవీ మరియు న్యూ జనరేషన్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

Source: Business Standard

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Suzuki Alto India Launch Timeline Revealed
Story first published: Tuesday, June 19, 2018, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X