TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లలో ఏఎమ్‌టి పరిచయం చేసిన మారుతి
మారుతి సుజుకి తాజాగా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ టాప్ ఎండ్ జడ్ఎక్స్ఐ+ మరియు జడ్‌డిఐ+ వేరియంట్లను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 7.76 లక్షలు మరియు రూ. 8.76 లక్షలు ఎక్స్-షోరీమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. అప్పట్లో స్విఫ్ట్ మిడ్ వేరియంట్లయిన విఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ, విడిఐ మరియు జడ్‌డిఐ మోడళ్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేసింది.
అంటే, స్విఫ్ట్ ఏఎమ్‌టి వేరియంట్ ఎంచుకునే కస్టమర్లు స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లలో లభించే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లను మిస్సవ్వాల్సిందే.
తక్కువ ధరలో విడుదల చేయాలనే ఉద్దేశంతో మారుతి సుజుకి తొలుత స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లలో ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను పరిచయం చేయలేదు. అయితే, ఇప్పుడు మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించడంతో సేల్స్ పెంచుకునేందుకు ఎట్టకేలకు టాప్ ఎండ్ వేరియంట్లను కూడా ఏఎమ్‌టి గేర్‍బాక్స్‌తో విడుదల చేసింది.
మారుతి సుజుకి మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును తేలికపాటి మరియు ధృడమైన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. దీంతో మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే డిజైన్ పూర్తిగా భారీ మార్పులు సంభవించినప్పటికీ తక్కువ బరువుతో ఎక్కువ ధృడంగా వచ్చింది.
మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ జడ్ఎక్స్ఐ+ మరియు జడ్‌డిఐ+ వేరియంట్లలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగ్ ఎల్ఈడీ ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. అదననంగా, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త తరం మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. సాంకేతికంగా ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
అదే విధంగా మారుతి స్విఫ్ట్‌లోని 1.3-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు రెండు ఇంజన్ ఆప్షన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఎట్టకేలకు తమ స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పరిచయం చేసింది. కస్టమర్లు ఇప్పుడు, స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లను మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. ఈ విడుదల ఇప్పుడు మారుతి సుజుకి మరిన్ని సేల్స్ సాధించిపెట్టనుంది.