బుకింగ్స్ మరియు వెయిటింగ్ పీరియడ్‌కు సరికొత్త నిర్వచనమిచ్చిన మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో మూడవ తరానికి చెందిన న్యూ స్విఫ్ట్ హ్యాచ్‌‌బ్యాక్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. కొత్త తరం మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-ష

By Anil Kumar

మారుతి సుజుకి ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో మూడవ తరానికి చెందిన న్యూ స్విఫ్ట్ హ్యాచ్‌‌బ్యాక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త తరం మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. విడుదలకు కేవలం కొన్ని రోజుల ముందు స్విఫ్ట్ మీద దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

ఇప్పుడు, మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభించిన రెండు నెలలలోపే ఏకంగా 90,000 బుకింగ్స్ నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య పట్టణాల్లో స్విఫ్ట్ మీద రెండు నెలల వెయింటింగ్ పీరియడ్ ఉంది. అంటే బుక్ చేసుకున్న స్విఫ్ట్ డెలివరీ అవ్వాలంటే ఆ సమయం నుండి రెండు నెలల ఆగాల్సిందే...

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రస్తుతం, హాటు కేకుల్లా అమ్ముడవుతున్న కార్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి. విడుదలయ్యి కనీసం రెండు నెలలు కూడా పూర్తి కాకముందే విపరీతమైన సేల్స్‌ మరియు బుకింగ్స్‌తో సునామీ సృష్టిస్తోంది. ఇక కొత్త స్విఫ్ట్ కారును ఎంచుకోవాలని తహతహలాడేవారికి ఇప్పట్లో స్విఫ్ట్ ఒక అందని ద్రాక్ష అని చెప్పవచ్చు. అయినప్పటికీ, ఆలస్యించిన ఆశా భంగం. కాబట్టి బుక్ చేసుకోవడమే మంచిది.

మారుతి సుజుకి స్విఫ్ట్

థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ మారుతి సుజుకి ఇండియాకు భారీ సక్సెస్ సాధించి పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో న్యూ స్విఫ్ట్ మోస్ట్ పాపులర్ కారుగా నిలిచింది. డిజైన్, ఎక్ట్సీరియర్, ఇంటీరియర్, ఫీచర్లు, సేఫ్టీ మరియు మైలేజ్ పరంగా భారీ మార్పులతో రావడంతో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ ఫ్రంట్, సైడ్ మరియు రియర్ భాగాలను నూతన డిజైన్ లాంగ్వేజ్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేయబడింది. దీంతో అన్ని రకాల వయస్కుల వారిని ఆకట్టుకోవడంలో స్విఫ్ట్ మంచి మార్కులే సంపాదించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రత్యేకంగా గుర్తించదగిన ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాల్లో సరికొత్త హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేయబడిన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, అల్లాయ్ వీల్స్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. పెట్రోల్ వేరియంట్ 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

థర్డ్ జనరేషన్ మారుతి స్విఫ్ట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌లతో లభ్యమవుతోంది. మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 22కిమీలు మరియు స్విప్ట్ డీజల్ వెర్షన్ లీటర్‌కు 28.4కిమీల మైలేజ్ ఇస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

స్విఫ్ట్ కంటే ముందు గత ఏడాది విపణిలోకి విడుదలైన న్యూ డిజైర్ ఇంటీరియర్ మొత్తాన్ని యథావిధిగా కొత్త తరం స్విఫ్ట్ ఇంటీరియర్‌లో చూడవచ్చు. ఇందులో ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఏ/సి కంట్రోల్ డయల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇంటీరియర్ ఓవరాల్ డిజైన్ మునుపటి తరం స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఎంతో విలాసవంతంగా లగ్జరీ ఫీల్ ఇందులో గుర్తించవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్

డైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో కొత్త తరం మారుతి స్విఫ్ట్ అత్యంత ముఖ్యమైన కారు. నూతన డిజైన్ ఫిలాసఫీ, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన మరియు అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే ఇంజన్ ఆప్షన్లు వంటి ఎన్నో అంశాలు మారుతి స్విఫ్ట్‌ బెస్ట్ కారుగా నిలవడంలో కీలకమయ్యాయి.

బుకింగ్స్ ప్రారంభమైన కేవలం రెండు నెలల వ్యవధిలోపే 90,000 బుకింగ్స్ నమోదయ్యాయి. భవిష్యత్తులో సరికొత్త మైలురాళ్లను చేధించి. ఇంకా ఎన్నో రికార్డులను బద్దలుకొట్టనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, March 18, 2018, 19:29 [IST]
English summary
Read In Telugu: New Maruti Swift Garners Over 90,000 Bookings; Waiting Period Soars Up
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+