ఆటో ఎక్స్‌పో 2018: మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల- ధర, వేరియంట్లు, ఇంజన్, ఫీచర్లు, కలర్స్ మరియు ఫోటోలు

మారుతి సుజుకి విపణిలోకి సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. ఇండియా మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 4.99 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది

Recommended Video

New Honda Amaze Facelift Auto Expo 2018

ఆటో ఎక్స్‌పో 2018: మారుతి సుజుకి విపణిలోకి సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. ఇండియా మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా రూ. 4.99 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో ప్రవేశపెట్టింది.

భారీ అంచనాలతో మార్కెట్లోకి విడుదలైన భారతదేశపు మోస్ట్ సక్సస్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ 2018 స్విఫ్ట్ ధరలు, వేరియంట్లు, ఇంజన్, స్పెసిఫికేషన్స్, మైలేజ్, ఫీచర్లు, లభించే రంగులు మరియు ఫోటోలు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

2018 మారుతి స్విఫ్ట్

సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ ఆరు పెట్రోల్ వేరియంట్లలో మరియు ఆరు డీజల్ వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిని మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు బ్రాండ్ న్యూ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో కూడా లభ్యమవుతోంది.

2018 మారుతి స్విఫ్ట్

సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ విపణిలో ఉన్న ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు నిస్సాన్ మైక్రా హ్యాచ్‍‍‌‌బ్యాక్‌ కార్లకు గట్టి పోటీనిస్తుంది. మారుతి స్విఫ్ట్ లభ్యమయ్యే మొత్తం 12 వేరియంట్లలో విఎక్స్ఐ, విడిఐ, జడ్ఎక్స్ఐ మరియు జడ్‌డిఐ వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

2018 మారుతి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

Variant Name Price
LXI Rs 4.99 lakh
VXI Rs 5.87 lakh
VXI (AMT) Rs 6.34 lakh
ZXI Rs 6.49 lakh
ZXI (AMT) Rs 6.96 lakh
ZXI+ Rs 7.39 lakh
2018 మారుతి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ డీజల్ వేరియంట్ల ధరలు

Variant Name Price
LDI Rs 5.99 lakh
VDI Rs 6.87 lakh
VDI (AMT) Rs 7.34 lakh
ZDI Rs 7.49 lakh
ZDI (AMT) Rs 7.96 lakh
ZDI+ Rs 8.29 lakh
2018 మారుతి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా సెకండ్ జనరేషన్ స్విఫ్ట్‌లోని అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. కొత్త తరం స్విఫ్ట్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటీ గల టుర్బోఛార్జ‌డ్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

స్విఫ్ట్‌లోని పెట్రోల్ వెర్షన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 83బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే విధంగా డీజల్ వెర్షన్ 4,000ఆర్‌పిమ్ ఇంజన్ వేగం వద్ద 74బిహెచ్‌పి పవర్ మరియు 2,000ఆర్‌పిఎమ్ వద్ద 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 మారుతి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ ట్రాన్స్‌మిషన్

మారుతి ఇప్పటి వరకు విక్రయించిన మొదటి మరియు రెండవ తరం స్విఫ్ట్ కార్లలో కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండేది. అయితే, ఈ మూడవ తరం స్విఫ్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్ కూడా పరిచయం చేసింది.

2018 మారుతి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ మైలేజ్

  • 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ స్విఫ్ట్ మైలేజ్: 22కిమీ/లీ
  • 1.3-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ స్విఫ్ట్ మైలేజ్: 28.4కిమీ/లీ
  • 2018 మారుతి స్విఫ్ట్

    సరికొత్త హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన మారుతి

    మారుతి సుజుకి 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సుజుకి వారి నూతన హార్టెక్(HEARTECT) ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. గతంలో విడుదలైన న్యూ డిజైర్ మరియు బాలెనో కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. అందుకే, ఆ రెండు కార్ల పోలికలను కొద్దిగా న్యూ స్విఫ్ట్‌లో గుర్తించవచ్చు.

    2018 మారుతి స్విఫ్ట్

    నూతన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించడంతో, తక్కువ బరువుతో విశాలమైన క్యాబిన్ సాధ్యమైంది. అంతే కాకుండా తేలికపాటి ఛాసిస్ మీద రూపొందించడం జరిగింది. దీంతో అత్యుత్తమ హ్యాండ్లింగ్ మరియు బెస్ట్ మైలేజ్ సాధ్యమైందని మారుతి బృందం పేర్కొంది.

    2018 మారుతి స్విఫ్ట్

    హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో కొత్త స్విఫ్ట్ పాత స్విఫ్ట్ కంటే 85కిలోల తక్కువ బరువును కలిగి ఉంది. పెట్రోల్ స్విఫ్ట్ బరుపు 855 నుండి 880కిలోల మధ్య మరియు డీజల్ స్విఫ్ట్ బరువు 955 మరియు 985కిలోల మధ్య ఉంది. లగేజ్ స్పేస్ కూడా 58-లీటర్లు పెరిగి మొత్తం 265-లీటర్లుగా ఉంది.

    2018 మారుతి స్విఫ్ట్

    2018 మారుతి స్విఫ్ట్ కొలతలు

    సరికొత్త మారుతి స్విఫ్ట్ పొడవు 3,840ఎమ్ఎమ్, వెడల్పు 1,735ఎమ్ఎమ్, ఎత్తు 1,530ఎమ్ఎమ్ మరియు వీల్‌ బేస్ 2,450ఎమ్ఎమ్‍గా ఉంది. మునుపటి వెర్షన్‌ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే 40ఎమ్ఎమ్ వరకు వెడల్పు, 20ఎమ్ఎమ్ వరకు ఎత్తు పెరిగింది. అయితే, పొడవులో 10ఎమ్ఎమ్ తగ్గింది. గ్రౌండ్ క్లియరెన్స్ 163ఎమ్ఎమ్‌గా ఉంది.

    2018 మారుతి స్విఫ్ట్

    2018 మారుతి స్విఫ్ట్ డిజైన్

    2018 స్విఫ్ట్‌ను చూడగానే ముందుగా ఆకట్టుకునేది డిజైన్. నిజమే, పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఆ వ్యత్యాసం ఏంటో తెలుస్తుంది. ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న సరికొత్త హెక్సా గోనల్ సింగల్ పీస్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న ఆకర్షణీయమైన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

    2018 మారుతి స్విఫ్ట్

    కొత్త తరం స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడటానికి సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ శైలిలోనే ఉంటుంది. అయితే, ఈ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, విండో ఫ్రేమ్ మీద ఉన్న డోర్ హ్యాండిల్‌ ఉండటంతో సైడ్ డిజైన్ చాలా క్లీన్‌గా ఉంటుంది.

    2018 మారుతి స్విఫ్ట్

    రియర్ డిజైన్‌లో కూడా స్పష్టంగా గుర్తించదగిన మార్పులు సంభవించాయి. న్యూ మారుతి స్విఫ్ట్ రియర్ ప్రొఫైల్‌లో రీడిజైన్ చేయబడిన C-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, కొత్తగా రూపొందించిన టెయిల్‌గేట్ మరియు సరికొత్త బంపర్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న స్విప్ట్‌లో వచ్చే మారుతి సుజుకి లోగో కాకుండా కేవలం సుజుకి లోగోను మాత్రమే అందించారు. మరియు నెంబర్ ప్లేట్ పొజిషన్ కూడా బంపర్‌లో ఇముడింపజేశారు.

    2018 మారుతి స్విఫ్ట్

    2018 మారుతి స్విఫ్ట్ ఇంటీరియర్

    కొత్త తరం స్విఫ్ట్ ఇంటీరియర్‌ పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే భారీ మార్పులు జరిగాయి. స్పోర్టివ్ డ్యాష్‌బోర్డ్, అత్యాధునిక ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ డయల్ కంట్రోల్స్, డ్యూయల్ టోన్ ఫ్లాట్-బాటమ్ స్పోర్టివ్ స్టీరింగ్ వీల్ ఇంటీరియర్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

    2018 మారుతి స్విఫ్ట్

    2018 మారుతి స్విఫ్ట్ ఫీచర్లు

    సరికొత్త 2018 స్విఫ్ట్ ఇంటీరియర్‌లో వచ్చిన విప్లవాత్మక 7-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

    2018 మారుతి స్విఫ్ట్

    డయల్ టైప్ క్లమైటే కంట్రోల్ సిస్టమ్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఏ/సి వెంట్స్, ఇన్పోటైన్‌మెంట్ చుట్టుపక్కల పియానో బ్లాక్ ఫినిషింగ్ గుర్తించవచ్చు. పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న డ్యాష్‌‌బోర్డ్ ఇంటీరియర్ మొత్తానికి ప్రీమియమ్ లుక్ తీసుకొచ్చింది.

    2018 మారుతి స్విఫ్ట్

    2018 మారుతి స్విఫ్ట్ లభించే రంగులు

    2018 మారుతి స్విఫ్ట్ ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి,

    • సాలిడ్ ఫైర్ రెడ్,
    • పర్ల్ ఆర్కిటిక్ వైట్,
    • మెటాలిక్ సిల్కీ సిల్వర్,
    • మ్యాగ్మా గ్రే,
    • మిడ్‌నైట్ బ్లూ,
    • ప్రైమ్ లుసెంట్ ఆరేంజ్
    • 2018 మారుతి స్విఫ్ట్

      2018 మారుతి స్విఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

      భద్రత పరంగా 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్ మరియు నైట్ అడ్జస్టబుల్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి ఉన్నాయి.

      2018 మారుతి స్విఫ్ట్

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      మారుతి సుజుకి ఎట్టకేలకు తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌ను విపణిలోకి లాంచ్ చేసింది. డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు మరియు సేఫ్టీ పరంగా మారుతి స్విఫ్ట్ అద్భుతమైన హ్యాచ్‌బ్యాక్ 2018 మారుతి స్విఫ్ట్. ఇదే డిజైన్ ఫిలాసఫీలో వచ్చిన న్యూ డిజైర్ భారీ విజయాన్ని అందుకుంది, కాబట్టి 2018 స్విఫ్ట్ కూడా సక్సెస్ బాట పట్టడం ఖాయం. మారుతి సుజుకి ఇది వరకే అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించగా ఇప్పటికే 30,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.

      2018 మారుతి స్విఫ్ట్ కారు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరు!!

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: New Maruti Swift 2018 Launched At Rs 4.99 Lakh - Price, Specs, Mileage, Colours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X