2018 స్విఫ్ట్ అఫీషియల్ బుకింగ్స్ స్టార్ట్: బుకింగ్ ధర మరియు డెలివరీ వివరాలు!!

మారుతి సుజుకి డీలర్లు అనధికారికంగా స్విఫ్ట్ బుకింగ్స్ చేపడుతున్నట్లు డ్రైవ్‌స్పార్క్ ఇప్పటికే ఓ కథనాన్ని ప్రచురించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్విఫ్ట్ అఫీషియల్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.

By Anil

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

మారుతి సుజుకి డీలర్లు అనధికారికంగా స్విఫ్ట్ బుకింగ్స్ చేపడుతున్నట్లు డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇప్పటికే ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్విఫ్ట్ అఫీషియల్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. స్విఫ్ట్ ప్రేమికులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మారుతి అధీకృత డీలర్ల వద్ద 2018 స్విఫ్ట్ మీద ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చు.

కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్, విడుదల మరియు డెలివరీకి సంభందించిన వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

రూ. 11,000 ల మొత్తాన్ని చెల్లించి 2018 మారుతి స్విఫ్ట్ కారును అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకోవచ్చు. కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరి చివరి నాటికి డీలర్లను చేరే అవకాశం ఉంది.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

అదే విధంగా ఫిబ్రవరి 7, 2018 నుండి ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద మారుతి సుజుకి తమ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించి మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

"డ్రైవ్‌స్పార్క్" బృందం దేశవ్యాప్తంగా ఉన్న పలు మారుతి సుజుకి డీలర్లను సంప్రదించగా, విక్రయ కేంద్రాల కథనం మేరకు 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదల ఫిబ్రవరి 2018 లోనే ఉండనున్నట్లు స్పష్టం చేశాయి.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

అంతే కాకుండా, ప్రస్తుతం స్విఫ్ట్ మీద వస్తున్న డిమాండుకు అనుగుణంగా సుమారుగా ఆరు నుండి ఎనిమిది నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంది. మరియు నూతన స్విఫ్ట్ ఆరు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

అయితే, కొత్త స్విఫ్ట్ ఎన్ని వేరియంట్లలో... ఎలాంటి వేరియంట్లలో వస్తోందనే వివరాలు తెలియరాలేదు. వేరియంట్ల గురించి డీలర్‌ను సంప్రదించగా,"స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్న తరువాత విడుదల అనంతరం డెలివరీ లోపు మీకు నచ్చిన వేరియంట్‌ను మార్చుకునే ఎంచుకునే సౌలభ్యం ఉన్న తెలిపారు.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

రానున్న పది రోజుల్లోపు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు స్విఫ్ట్ విడుదలైన తరువాత తొలి ప్రాధాన్యతగా వారికే ముందస్తు డెలివరీ ఇవ్వనున్నట్లు డీలర్లు తెలిపారు. బుకింగ్స్, బుకింగ్ ధర, విడుదల, వేరియంట్లు మరియు డెలివరీల గురించి మరిన్ని వివరాలకు సమీపంలోని మారుతి డీలర్‌ను సంప్రదించగలరు.

Trending On DriveSpark Telugu:

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి సుజుకి 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును సుజుకి వారి హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. అధిక తన్యత గల స్టీల్‌తో తేలికపాటి బరువు బరువు ఉండేలా బాడ మొత్తాన్ని ధృడంగా నిర్మించారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీదనే బాలెనో మరియు న్యూ డిజైర్ కార్లను కూడా అభివృద్ది చేశారు.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

2018 మారుతి స్విఫ్ట్ ఫ్రంట్ డిజైన్ విషయానికి వస్తే భారీ మార్పులు సంతరించుకున్నాయి. ఇందులో పెద్ద పరిమాణంలో ఉన్న సింగల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా రూపొందించిన హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ప్రొజెక్టర్ లైట్లు ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్ గమినిస్తే స్లోపింగ్ రూఫ్ డిజైన్(కారు ముందు నుండి వెనుక డోర్ చివరి వరకు వాలుగా ఉన్న రూఫ్ టాప్), బ్లాక్ కలర్‌లో ఉన్న రియర్ పిల్లర్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్ ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్ గమినిస్తే స్లోపింగ్ రూఫ్ డిజైన్(కారు ముందు నుండి వెనుక డోర్ చివరి వరకు వాలుగా ఉన్న రూఫ్ టాప్), బ్లాక్ కలర్‌లో ఉన్న రియర్ పిల్లర్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్ ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎక్ట్సీరియర్ తరహాలోనే భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా గుర్తించదగిన వాటిలో ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అధునాతన ఫీచర్లతో పాటు ప్రీమియమ్ ఫీల్ కలిగించే అప్‌హోల్‌స్ట్రే అందివ్వనుంది.

మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018లోనే కొత్త తరం స్విఫ్ట్ అతి ముఖ్యమైన విడుదలవ్వనుంది. ఇటు కస్టమర్లు, అటు కంపెనీ స్విఫ్ట్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నాయి. స్విఫ్ట్ విడుదలైనప్పటి నుండి మారుతికి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. ఇప్పుడు వస్తోన్న థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ మునుపటి మోడళ్ల విజయాన్ని కొనసాగించడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Friday, January 19, 2018, 11:15 [IST]
English summary
Read In Telugu: 2018 Maruti Swift Official Bookings Open In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+