న్యూ మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో మధ్య హోరాహోరీ పోటీ

Written By:

కొన్ని కార్ల కంపెనీలకు కనీస అమ్మకాలు లేక విలవిల్లాడిపోతుంటే... మరికొన్ని కంపెనీలు విపరీతమైన సేల్స్‌తో సతమతమవుతున్నాయి. ఇందుకు మారుతి సుజుకి ప్రధాన ఉదాహరణ. ప్రత్యేకించి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లకు వస్తున్న డిమాండుకు మారుతికి చుక్కలు కనబడుతున్నాయి.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

ఇటీవల మారుతి విడుదల చేసిన న్యూ స్విఫ్ట్ మరియు బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు భారీ సేల్స్‌తో మారుతిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. డిమాండుకు తగ్గ ఉత్పత్తి చేయడానికి మారుతికి చెమటలు పడుతున్నాయి.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

మారుతి సుజుకి ఫిబ్రవరి 8, 2018న విపణిలోకి థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 17,291 యూనిట్ల విక్రయాలు సాధించింది. ఇదే ఫిబ్రవరి అమ్మకాల్లో న్యూ స్విఫ్ట్ మారుతి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో కంటే అధిక విక్రయాలు సాధించింది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

గడిచిన ఫిబ్రవరి 2018లో 17,291 యూనిట్ల స్విఫ్ట్ కార్లు అమ్ముడవ్వగా... ఇదే నెలలో 15,087 యూనిట్ల మారుతి బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. విడుదలయ్యి సుమారుగా రెండేళ్లు కావస్తున్నా... బాలెనో సేల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. విపణిలోని బి2-సెగ్మెంట్లో మారుతి కార్లే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

మారుతి సుజుకి కొత్త చరం స్విఫ్ట్ కారు మీద బుకింగ్స్ ప్రారంభించిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే 75,000 యూనిట్లు బుక్ అయ్యాయి. మారుతి ప్రస్తుతం, స్విఫ్ట్ కారును గుజరాత్‌లోని హన్సల్‍‌పూర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది మరియు బాలెనో కారును హర్యానాలోని మానేసర్ ప్లాంటులో తయారు చేస్తోంది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో సేల్స్ సునామీ సృష్టిస్తున్న బాలెనో మరియు స్విఫ్ట్ కార్ల ధరలు చాలా దగ్గరగా ఉంటాయి. మారుతి స్విఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.99 లక్షలు మరియు మారుతి ప్రీమియమ్ హ్యాచ్‌‌బ్యాక్ బాలెనో ప్రారంభ ధర రూ. 5.36 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

స్విఫ్ట్ మరియు బాలెనో రెండు కార్లు కూడా అవే 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు ఫియట్ నుండి సేకరించిన 1.3-లీటర్ మల్టీజెట్ టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌లతో లభ్యమవుతున్నాయి. వీటిలో పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో

రెండు మోడళ్లలోని రెండు ఇంజన్ ఆప్షన్‍లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. మారుతి బాలెనో శక్తివంతమైన 1-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో ఆర్ఎస్ వెర్షన్‌లో లభ్యమవుతోంది. బాలెనో పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షనల్‌గా లభిస్తుండగా, స్విఫ్ట్ రెండు ఇంజన్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu: New Maruti Swift outsells Baleno in first month of sales
Story first published: Monday, March 12, 2018, 15:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark