145 రోజుల్లో 1,00,000 స్విఫ్ట్ కార్లను విక్రయించిన మారుతి సుజుకి

కేవలం 145 రోజుల్లోనే 1,00,000 స్విఫ్ట్ కార్లను మారుతి సుజుకి విక్రయించింది. అంటే రోజుకి 689 యూనిట్ల చొప్పున అమ్ముడుపోతున్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మొట్టమొదటిసారిగా 2005లో పరిచయం చే

By Anil Kumar

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త స్విఫ్ట్ కారును లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అనతి కాలంలోనే ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డు సృష్టించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

కేవలం 145 రోజుల్లోనే 1,00,000 స్విఫ్ట్ కార్లను మారుతి సుజుకి విక్రయించింది. అంటే రోజుకి 689 యూనిట్ల చొప్పున అమ్ముడుపోతున్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మొట్టమొదటిసారిగా 2005లో పరిచయం చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

2005 నుండి ఇప్పటి వరకు జరిగిన మొత్తం విక్రయాల్లో 18 లక్షల 90 వేల స్విఫ్ట్ కార్లను మారుతి విక్రయించింది. అనతి కాలంలోనే భారతదేశపు మోస్ట్ పాపులర్ కార్లలో ఒకటిగా నిలిచిపోయింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

జూన్ 2018 చివరి నాటికి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం విక్రయాల సంఖ్య 20 లక్షల యూనిట్లకు దాటిపోనుంది. 2018 స్విఫ్ట్ కారును మారుతి సుజుకి అధునాతన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. అంతే కాకుండా, అన్ని వేరియంట్లలో విభిన్న ఫీచర్లను అందిస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

కొత్త తరం మారుతి స్విఫ్ట్ ఎక్ట్సీరియర్‌లో ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇజి లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్ టోన్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్పోర్టివ్ ఫ్లాట్‌-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఈ రెండింటిని స్విఫ్ట్‌ ఇంటీరియర్‌లో చోటు చేసుకున్న కీలకమైన మార్పులని చెప్పుకోవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

2018 మారుతి స్విఫ్ట్ సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. ఇవి వరుసగా 83బిహెచ్‌పి-113ఎన్ఎమ్ మరియు 74బిహెచ్‌పి-190ఎన్‌ఎమ్ ప్రొడ్యూస్ చేస్తాయి. కొత్త తరం స్విఫ్ట్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

మారుతి సుజుకి ఇటీవల 2 కోట్ల కార్ల ప్రొడక్షన్ మైలురాయిని చేధించింది. అంతే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన పది కార్ల కంపెనీల జాబితాలో భారతదేశపు తొలి కంపెనీ మారుతి సుజుకి స్థానం సంపాదించింది. జపాన్ దిగ్గజం సుజుకి మోటార్స్ దేశీయ సంస్థ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌తో చేతులు కలిపి ఉమ్మడి భాగస్వామ్యం క్రింద 1983లో ఇండియాలో తమ ప్రొడక్షన్ ప్రారంభించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ ఆర్ఎస్ కల్సి మాట్లాడుతూ, "దిగ్గజ స్విఫ్ట్ హ్యాచ్‌‌బ్యాక్ కారు విడుదలైన 145 రోజుల్లోనే 1,00,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి భారతీయుల గుండెచప్పుడుగా మరోసారి నిరూపించుకుందని చెప్పుకొచ్చాడు."

భారీ మార్పులు చేర్పులతో, ఎన్నో ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లతో విడుదలైన మారుతి స్విఫ్ట్ భారీ విజయాన్ని అందుకోవడం పట్ల ఆర్ఎస్ కల్సి హర్షం వ్యక్తం చేశాడు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్

డ్రైవ్‍‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి స్విఫ్ట్ మోస్ట్ పాపులర్ కారుగా నిలిచింది. మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పో వేదికగా విడుదలయ్యింది. ఒకానొక దశలో భారతదేశపు బెస్ట్ సెల్లింగా కారుగా కూడా నిలిచింది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Swift Sells One Lakh Units In 145 Days — Fastest Selling Car In India
Story first published: Monday, June 18, 2018, 12:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X