కొత్త తరం స్విఫ్ట్ బుక్ చేసుకున్న వారు రెండు నెలలు వేచి చూడాల్సిందే

Written By:
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

మారుతి సుజుకి తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారును కొత్త వెర్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తరుణంలో పాత తరం స్విఫ్ట్ తయారీ మరియు విక్రయాలను పూర్తిగా నిలిపివేసిన మారుతి ఇప్పుడు సరికొత్త స్విఫ్ట్ డెలివరీ గురించి కొన్ని వివరాలను రహస్యంగా వెల్లడించింది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

నచ్చిన కారును బుక్ చేసుకున్న తరువాత ఎవరైనా అడిగే మొదటి ప్రశ్న - డెలివరీ ఎప్పుడు? కాబట్టి, కొత్త తరం స్విఫ్ట్ డెలివరీ విషయానికి వస్తే ఏయే వేరియంట్ల మీద ఎంత వరకు వెయిటింగ్ పీరియడ్ ఉందో మారుతి సుజుకి వెల్లడించింది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న 2018 స్విఫ్ట్ బుక్ చేసుకున్న వారికి వివిధ వేరియంట్ల ఆధారంగా 6 నుండి 8 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్ల మీద ఈ వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

రిపోర్ట్స్ ప్రకారం, కస్టమర్లు ఎంచుకునే వేరియంట్ మరియు కలర్ ఆప్షన్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్‌ ఒక్కో కస్టమర్‌కు ఒక్కో విధంగా ఉండనుంది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్ల కొత్త తరం స్విఫ్ట్ మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించాయి. సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును రూ. 11,000లతో బుక్ చేసుకోవచ్చు.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌హబ్యాక్ మొత్తం 12 విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిలో నాలుగు వేరియంట్లు ఆటో గేర్‌ షిఫ్ట్(AGS) లేదా ప్రసిద్దిగాంచిన ఆటోమేటిక్(AMT)తో లభిస్తున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

పెట్రోల్ మరియు డీజల్ కొత్త తరం స్విఫ్ట్ టాప్ జడ్ ప్లస్ వేరియంట్లలో అధునాతన ప్రీమియమ్ ఫీచర్లు వస్తున్నాయి. అవి, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు న్యావిగేషన్ మరియు వాయిస్ కమాండ్ సోర్ట్ చేయగల స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లతో దొరికితే దంపుడే!!

హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఘోర ప్రమాదం!!

ప్యాసింజర్ కార్ల పరిశ్రమను శాసించే ప్రణాళిక వెల్లడించిన టాటా

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

స్టీరింగ్ వీల్ ఆధారిత కంట్రోల్స్, స్మార్ట్ కీ ద్వారా ఇంజన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు పెట్రోల్ మరియు డీజల్ స్విఫ్ట్ లోని జడ్ మరియు జడ్ ప్లస్ వేరియంట్లలో ఉన్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

మారుతి సుజుకి భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు స్విఫ్ట్‌లోని ప్రారంభ వేరియంట్ నుండి టాప్ ఎండ్ వరకు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించింది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

జపాన్ దిగ్గజం సుజుకి ఈ కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌్బ్యాక్ కారును హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. దీంతో మునుపటి స్విఫ్ట్‌తో పోల్చుకుంటే దీని బరువు 90 కిలోల వరకు తగ్గింది. దీంతో వెహికల్ మొత్తం పనితీరు పెరగడంతో పాటు గణనీయమైన మైలేజ్ కూడా సాధ్యమవుతుంది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

2018 మారుతి స్విఫ్ట్ ఫ్రెష్ లుక్ సొంతం చేకుంది. ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన హెడ్ ల్యాంప్ డిజైన్, పదునైన డిజైన్ ఎలిమెంట్లు, నూతన ఫ్రంట్ గ్రిల్ మరియు స్పోర్టివ్ లుక్ కలిగిచే అత్యాధునిక ఫ్రంట్ గ్రిల్ ఉంది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ మరియు ఫీచర్లు పరంగా ఎన్నో మార్పులు జరిగినప్పటికీ సాంకేతికంగా అవే ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. మారుతి ఈ నూతన 2018 స్విఫ్ట్ కారులో అదే 1.3-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను అందించింది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

2018 స్విఫ్ట్‌లో ఉన్న నాలుగు సిలిండర్ల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 82బిహెచ్‌పి పవర్ మరియు 4,200ఆర్‌పిఎమ్ వద్ద 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

అదే విధంగా స్విఫ్ట్ డీజల్ వెర్షన్‌లోని 1.3-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్ 4,000ఆర్‌పిఎమ్ వద్ద 74బిహెచ్‌పి పవర్ మరియు 2,000ఆర్‌పిఎమ్ వద్ద 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ స్విఫ్ట్ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి అతి త్వరలో విడుదల చేయనున్న స్విఫ్ట్ పరంగా కస్టమర్లలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఒక్క ధర మినహా డిజైన్, ఇంజన్, వేరియంట్లు మరియు ఫీచర్లను రివీల్ చేసిన మారుతి ధరలు ఏ మేరకు ఉండవచ్చో అనే ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

2018 మారుతి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

భారీ మార్పులు, చేర్పులతో వస్తున్న కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ విపణిలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు ఫోర్డ్ ఫిగో కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

మారుతి కొత్త తరం స్విఫ్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి...

తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి..

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Team-BHP

English summary
Read In Telugu: Maruti Swift Waiting Period For 2018 Is Quite A Wait; New Swift Launching Soon!

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark