సరికొత్త వితారా ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

Written By:

మారుతి సుజుకి దేశీయ పెద్ద ఎస్‌యూవీల సెగ్మెంట్లో అత్యధిక మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే, వితారా బ్రిజా ఎస్‌యూవీని లాంచ్ చేసి, ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఆధిపత్యం చెలాయిస్తోంది.

మారుతి సుజుకి వితారా

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి మిడ్ సైజ్ ఎస్‌యూవీని వచ్చే 2019 నాటికల్లా ప్రవేశపెట్టడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు రహస్యంగా భారతీయ రోడ్ల మీద పరీక్షించిన కొత్త తరం వితారా ఎస్‌యూవీనే మిడ్ సైజ్ ఎస్‌యూవీ గా తీసుకురానుంది.

మారుతి సుజుకి వితారా

కొత్త తరం వితారా ఎస్‌యూవీ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. విపణిలో ఉన్న మారుతి ఎస్-క్రాస్ పైస్థానాన్ని భర్తీ చేయనున్న వితారా ధరను మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హ్యుందాయ్ క్రెటాలకు పోటీగా నిర్ణయించనుంది.

మారుతి సుజుకి వితారా

పెట్రోల్ వెర్షన్ మారుతి వితారా ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.4-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పవర్ విలువలతో సెగ్మెంట్ మొత్తం మీద మారుతి వితారానే అత్యంత శక్తివంతమైన పెట్రోల్ ఎస్‌యూవీగా నిలవనుంది.

మారుతి సుజుకి వితారా

డీజల్ వెర్షన్ వితారా కోసం ఫియట్ నుండి సేకరించిన 120బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.6-లీటర్ మల్టీజెట్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ రానుంది. పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అదే విధంగా డీజల్ యూనిట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనుంది.

మారుతి సుజుకి వితారా

అంతర్జాతీయ విపణిలో ఉన్న వితారా ఎస్‌యూవీ రియర్ వీల్ డ్రైవ్‌తో లభ్యమవుతోంది. కానీ, ఇండియన్ వెర్షన్ వితారా ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో వచ్చే అవకాశం ఉంది. 5-సీటర్ వితారా ఎస్‌యూవీ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎయిర్ బ్యాగులు వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా రానున్నాయి.

మారుతి సుజుకి వితారా

సరికొత్త మారుతి వితారా మారుతి సుజుకి ఇండియా యొక్క ఖరీదైన మరియు ప్రీమియమ్ ఎస్‌యూవీగా నిలవనుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన మారుతి రిటైలర్ నెక్సా షోరూమ్ ద్వారానే వితారా ఎస్‌యూవీని రూ. 9 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి వితారా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంట్రీ లెవల్ కార్ల నుండి హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్, మిడ్-సైజ్ సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు క్రాసోవర్ ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్లలో మారుతి సుజుకి సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తోంది. ఇప్పుడు, ఖరీదైన మిడ్-సైడ్ ప్రీమియమ్ ఎస్‌యూవీలో రాణించేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ500, హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు పోటీగా వితారా ఎస్‌యూవీని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

English summary
Read In Telugu: New Maruti Vitara India Launch Details Revealed; Expected Price, Specs And Features
Story first published: Saturday, March 24, 2018, 12:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark