2018 వ్యాగన్ ఆర్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న మారుతి

మారుతి సుజుకి 2018 వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మారుతి సుజుకి తాజాగా కొత్త తరం వ్యాగన్ ఆర్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ ఆటోమొబైల్ మీడియా కంటబడింది.

By Anil

Recommended Video

New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

మారుతి సుజుకి 2018 వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మారుతి సుజుకి తాజాగా కొత్త తరం వ్యాగన్ ఆర్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ ఆటోమొబైల్ మీడియా కంటబడింది. న్యూ జనరేషన్ వ్యాగన్ఆర్ కారును తొలిసారిగా అన్ని డిజైన్ అంశాలు కనబడే విధంగా పరీక్షించారు.

2018 మారుతి వ్యాగన్ఆర్

సరికొత్త వ్యాగన్ ఆర్ రియర్ డిజైన్‌లోని టెయిల్‌గేట్ మీద "ఐడ్లింగ్ స్టాప్" అనే బ్యాడ్జింగ్ వచ్చింది. అంటే మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది అత్యధిక మైలేజ్ ఇస్తుంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

2018 మారుతి వ్యాగన్ ఆర్‌ను మారుతి వారి సరికొత్త హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మించినట్లు తెలుస్తోంది. న్యూ డిజైర్ కాంపాక్ట్ సెడాన్, 2018 మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను గతంలో ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది.

2018 మారుతి వ్యాగన్ఆర్

రహస్యంగా పరీక్షలకొచ్చిన 2018 మారుతి వ్యాగన్ ఆర్‌లో చుట్టూ పట్టీ గల హెడ్ ల్యాంప్స్, సుజుకి లోగో గల మూడు స్లాట్ల క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, నాలుగు స్లాట్లు ఉన్న ఎయిర్ డ్యామ్, స్టీల్ వీల్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో ఎల్ఇడి లైటింగ్ మరియు టెయిల్‌లైట్లు ఉన్నాయి.

2018 మారుతి వ్యాగన్ఆర్

కొత్త తరానికి చెందిన మారుతి వ్యాగన్ ఆర్ మునుపటి మోడల్‌తో పోల్చితే తక్కువ ఎత్తులో అత్యంత పదునైన డిజైన్ శైలిలో ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే అధునాతన ప్రీమియమ్ ఫీచర్లతో పాటు సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా ఉన్నాయి.

2018 మారుతి వ్యాగన్ఆర్

హార్టెక్‌ఫ్లాట్ మీద నిర్మించడంతో మంచి రైడ్ మరియు హ్యాండ్లింగ్ మరియు విశాలమైన క్యాబిన్ సాధ్యమైంది. మునుపటి వేరియంట్‌తో పోల్చుకుంటే ఎన్నో కొత్త ఫీచర్లు ఇందులో వస్తున్నాయి. మారుతి సుజుకి సంస్థకు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది.

2018 మారుతి వ్యాగన్ఆర్

ప్రస్తుతం, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆ ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి తమ కొత్త తరం వ్యాగన్ఆర్‌లో ఇదే 1.0-లీటర్ ఇంజన్‌ను బిఎస్-VI ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌నే అందించే అవకాశం ఉంది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంజన్‌తో పాటు న్యూ జనరేషన్ వ్యాగన్ఆర్ మరింత సురక్షితమైంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

న్యూ మారుతి వ్యాగన్ ఆర్ 2018 మోడల్ ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎక్ట్సీరియర్‌లో స్వల్ప కాస్మొటిక్ మెరుగులు, ఇంటీరియర్‌లో నూతన ఫీచర్లు మరియు ప్రత్యేకించి న్యూ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో మరింత సురక్షితమైన మోడల్‌గా నిలవనుంది. మైలేజ్ ఛాంపియన్‌గా వస్తున్న వ్యాగన్ ఆర్ ధరకు తగ్గ విలువలతో వస్తే, 15 సంవత్సరాల విజయాన్ని కొత్త తరం మోడల్‌తో యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

More from DriveSpark

Article Published On: Tuesday, February 20, 2018, 9:23 [IST]
English summary
Read In Telugu: New Maruti Wagon R 2018 Spied Without Camouflage; Features ‘Idling Stop’ Function
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+