సోలియో 7-సీటర్ కారును పరీక్షిస్తున్న మారుతి సుజుకి
దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 7-సీటింగ్ కెపాసిటి గల వ్యాగన్ ఆర్ ఆధారిత సోలియా కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.
Recommended Video

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 7-సీటింగ్ కెపాసిటి గల వ్యాగన్ ఆర్ ఆధారిత సోలియా కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. అత్యంత సరసమైన ధరలో బడ్జెట్ ఫ్యామిలీ కారుగా సోలియా 7-సీటర్‌ను తీసుకొచ్చేందుకు మారుతి సిద్దమవుతోంది.
మారుతి సుజుకి సోలియా 7-సీటర్ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి కథనంలో...

మారుతి సుజుకి సోలియా 7-సీటర్ బడ్జెట్ ఫ్రెండ్లీ కారును 2012 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదిక మీద ప్రదర్శించింది. సరిగ్గా ఆరు సంవత్సరాల అనంతరం ఇప్పుడు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది.

గురుగ్రామ్ సిటీలో డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ అంశాలను దాచిపెట్టకుండా పబ్లిక్‌గా పరీక్షించింది. కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, మారుతి సుజుకి లోగో కనబడకుండా చేసిన స్టిక్కరింగ్ గమనించవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లలో సోలియా కారు 5+2 సీటింగ్ కెపాసిటీతో మినీ ఎమ్‌పీవీగా అందుబాటులో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... దీని పొడవు నాలుగు మీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది.

పొడవుగా తక్కువగా ఉన్నప్పటికీ విశాలమైన క్యాబిన్ కోసం బాడీ ఎత్తు కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో సోలియా 7-సీటర్ బాక్సీ స్టైల్లో ఉంది. సోలియో రియర్ డిజైన్‌లో ఇరువైపులా ఉన్న టెయిల్ ల్యాంప్స్ కలపుతూపోయే క్రోమ్ పట్టీ, విండ్ షీల్డ్ మరియు రూఫ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

డోర్ల విషయానికి వస్తే, ఓపెన్ డోర్లు కాకుండా ఓమిని తరహాలో స్లైడింగ్ డోర్లను ఎలక్ట్రిక్ పవర్‌తో ఆప్‌రేట్ చేసేలా ఉన్నాయి. ఇంటీరియర్‌లో 3-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు డ్యాష్ బోర్డ్ మధ్యలో అందించిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే ప్రతి కారులో కస్టమర్లు తప్పనిసరిగా కోరుకుంటున్న ఫీచర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇండియాలో అత్యధికంగా ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్న మారుతి దాదాపు తమ అన్ని కార్లలో ఈ ఫీచర్ అందించింది. ఈ అప్ కమింగ్ సోలియా మినీ ఎమ్‌పీవీలో అధునాతన సిల్వర్ ఫినిషింగ్‌లో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందిస్తోంది.

ఇంజన్ విషయానికి వస్తే, జపాన్ విపణిలో ఉన్న సోలియో 7-సీటర్ ఎమ్‌పీవీలో హైబ్రిడ్ పవర్ సిస్టమ్ ఉంది. మోటార్ జనరేటర్ యూనిట్ అనుసంధానం గల 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది.

5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఈ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ యూనిట్ మొత్తం 90బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద సోలియా 7-సీటర్ ఎమ్‌పీవీని పరీక్షించింది. అయితే, ఇప్పటి వరకు దీని ఆవిష్కరణ మరియు దేశీయంగా దీని విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు.
Trending DriveSpark Telugu YouTube Videos
Source: Team BHP


Click it and Unblock the Notifications








