టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టాటా మోటార్స్ గత ఏడాది దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి నెక్సాన్ ఎస్‌‌యూవీని విడుదల చేసింది. అప్పట్లో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ మాత్రమే ఉండేది. అయితే, తాజాగా జరిగిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఇప్పుడు ఆప

By Anil Kumar

టాటా మోటార్స్ గత ఏడాది దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి నెక్సాన్ ఎస్‌‌యూవీని విడుదల చేసింది. అప్పట్లో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ మాత్రమే ఉండేది. అయితే, తాజాగా జరిగిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఇప్పుడు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్ కూడా వచ్చింది.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టాటా మోటార్స్ ఆగష్టు 2018 నుండి డెలివరీ చేసే అన్ని టాటా నెక్సాన్ ఎస్‌యూవీలలో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కలదు. ఇది వరకే నెక్సాన్ ఎస్‌యూవీలను కొనుగోలు చేసిన కస్టమర్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం సమీపంలో ఉన్న టాటా విక్రయ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టాటా నెక్సాన్ లభించే ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్ + మరియు ఎక్స్‌జడ్ఎ+ వేరియంట్లలో 6.5-అంగుళాల పరిమాణంలో ఉన్న ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టాటా మోటార్స్ సెప్టెంబర్ 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ఏడాది మే నెలలో నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ఎ+ వేరియంట్లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అదే విధంగా ఇటీవల మిడ్ వేరియంట్ ఎక్స్ఎమ్ లోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేసింది.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో అత్యంత కీలకమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్, న్యావిగేషన్, టెక్ట్స్ మరియు వాట్సాప్ మెసేజ్‌లను చదివి వినిపించే టెక్నాలజీ వంటి ఫీచర్లతో పాటు ఎక్ట్సీరియర్‌లో ప్రొజెక్టర్ హెడ్‌‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు మరియు 16-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

ప్రయాణికుల భద్రత పరంగా టాటా నెక్సాన్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, టాటా నెక్సాన్‌కు గ్లోబల్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో 4-స్టార్ రేటింగ్ దక్కించుకుంది.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

టాటా నెక్సాన్ సాంకేతికంగా, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. ఇందులో పెట్రోల్ యూనిట్ 108బిహెచ్‌పి-170ఎన్ఎమ్ అదే విధంగా డీజల్ యూనిట్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ ఎట్టకేలకు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్‌నను నెక్సాన్ కోసం పరిచయం చేసింది. తాజాగా జరిగిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో నెక్సాన్ ఎస్‌యూవీలోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. టాటా నెక్సాన్ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి చెందిన మరిన్ని పోటోల కోసం...

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon Gets Apple CarPlay With The Latest Software Update
Story first published: Thursday, August 9, 2018, 15:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X