టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

కొత్త కార్లకు ఢీ పరీక్షలు నిర్వహించి, వాటి భద్రత మరియు అవి ఎంత వరకు సురక్షితమైనవో తెలిపే గ్లోబల్ న్యూ కార్అసెస్‌మెంట్ ప్రోగామ్ వారు తాజాగా మేడిన్ ఇండియా టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి నిర్వహించిన క్రాష్ పరీక్షలు ఫలితాలను వెల్లడించారు.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి భద్రత పరంగా నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో అత్యద్భుతంగా 5 కు గాను 4-స్టార్ల రేటింగ్ దక్కించుకుంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

టాటా తయారు చేసే కార్లు నాణ్యతకు పెట్టిపెట్టింది. పేరుకు తగ్గట్లుగానే టాటా మార్కెట్లోకి విడుదల చేసిన ప్రతి కారు అతి ఘోరమైన ప్రమాదాల్లో కూడా ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన సందర్భాలు ఎన్నో.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

కొత్త కార్లకు భద్రత పరీక్షలు తప్పనిసరి కావడంతో, టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి గ్లోబల్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో క్రాష్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఓవరాల్ సేఫ్టీ రేటింగ్ 5 కు గాను 4-స్టార్ల రేటింగ్ పొందింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

ఈ తరహా ఫలితాలు అంతర్జాతీయ మోడళ్లకు కూడా సాధ్యం కాలేదు. టాటా మోటార్స్ యొక్క అద్భుతమైన నిర్మాణ విలువలు, నాణ్యత, మరియు ధరకు తగ్గ విలువలతో కూడా ఎన్నో సేఫ్టీ ఫీచర్లతో అత్యంత సురక్షితమైన మేడిన్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

పెద్దల భద్రత విభాగంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో నాలుగు స్టార్లు మరియు చిన్న పిల్లల విభాగంలో మూడు స్టార్ల రేటింగ్‌కే పరిమితమైంది. నెక్సాన్ ఓవరాల్ బాడీ ధృడమైనదిగా నిరూపించుకుంది. ధృడమైన శరీర నిర్మాణం ఎస్‌యూవీ యొక్క భద్రతను మరింత పెంచింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి గంటకు 64కిలోమీటర్ల వేగం వద్ద ముందు వైపున మూలల్లో క్రాష్ టెస్ట్ నిర్విహించారు. ఈ విభాగంలో, పెద్దలు మరియు పిల్లల తల అదే విధంగా మెడ వంటి భాగాలకు రక్షణ అందింది. అయితే, ఛాతీ సేఫ్టీ విషయంలో కాస్త నిరాశపరిచిందని గ్లోబల్ ఎన్‌సిఎపి పేర్కొంది. అయితే, నెక్సాన్ మొత్తం క్రాష్ టెస్ట్ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నట్లు వివరించింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

ఎగుడుదిగుడుగా ఉన్న అవరోధాన్ని 64కిమీల వేగం వద్ద ఢీకొట్టినపుడు నెక్సాన్ బాడీ ధృడంగా ఉన్నట్లు గుర్తించారు. చైల్డ్ రీస్ట్రైన్ సిస్టమ్ ఉండటంతో 18 నెలల వయస్సున్న చిన్న పిల్లలకు కూడా నెక్సాన్‌లో అత్యుత్తమ సేఫ్టీ లభిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా ముందు సీటులో ఉన్న ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ పిల్ల తలకు అత్యుత్తమ సేఫ్టీని ఇచ్చినట్లు గుర్తించడం జరిగింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి. నెక్సాన్ ఐదుకు గాను 4-స్టార్ల రేటింగ్ పొందడంలో అన్ని సేఫ్టీ ఫీచర్లు కీలక పాత్ర పోషించాయి.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

గ్లోబల్ ఎన్‌సిఎపి సెక్రెటరీ జనరల్ మాట్లాడుతూ, "ఇండియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీ ఎంతో ధృడంగా నిర్మించింది. అక్టోబర్ 2017 నుండి అమల్లోకి వచ్చిన నూతన భద్రత ప్రమాణాలను టాటా నెక్సాన్ సునాయసంగా అందుకోగలిగింది. ఇందులో ఉన్న అన్ని సేఫ్టీ ఫీచర్లు, దీని నిర్మాణ నాణ్యత అద్భుతమని పేర్కొన్నాడు."

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

టాటా నెక్సాన్ గురించి...

టాటా మోటార్స్ గత ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన నెక్సాన్ మోడల్‌తో తమ మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీగా విపణిలోకి లాంచ్ చేసింది. అత్యంత శక్తివంతమైన డీజల్ ఇంజన్ మరియు పెట్రోల్ ఇంజన్ గల నెక్సాన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

నెక్సాన్ ఇంటీరియర్‌లో తొలిసారిగా సరికొత్త హార్మన్ మ్యూజిక్ సిస్టమ్, కాంపాక్ట్ ఎస్‌యూవీలలోనే తొలిసారిగా 6.5-అంగుళాల పరిమాణంలో ఉన్న ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ కీ, 31 రకాల విభిన్న స్మార్ట్ స్టోరేజ్ స్పేస్, మరియు డోర్లలో గొడుగులను స్టోర్ చేసుకునే సదుపాయం కల్పింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

లగ్జరీ మరియు హై ఎండ్ కార్లకే పరిమితమైన ఇలాంటి ఫీచర్లు, దేశీయ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తున్న ఇతర కంపెనీలు తమ మోడళ్లలో ప్రవేశపెట్టలేకపోయాయి. ప్రతి సాధారణ కస్టమర్‌ను చేరుకునే విధంగా టాటా నెక్సాన్‌ను తీర్చిదిద్దింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

గ్లోబల్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో టాటా నెక్సాన్‌కు నాలుగు స్టార్ల రేటింగ్ లభించింది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి మరియు ఎన్నో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను దాదాపు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

ధరకు తగ్గ విలువలతో, అధునాతన డిజైన్ అంశాలు, నూతన ఫీచర్లు, అద్వితీయమైన నిర్మాణ నాణ్యత, రాజీలేని పనితీరు మరియు అత్యంత సురక్షితమైన కారుగా టాటా నెక్సాన్ ఎస్‌యూవీ నిరూపించుకుంది. టాటా నెక్సాన్ వాహనాన్ని ఎంచుకునేవారు రెండో ఆలోచన లేకుండా నిశ్చింతగా ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

1. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న హై స్పీడ్ టాటా నెక్సాన్: అందరూ సేఫ్!!

2. తలక్రిందులైన టాటా నెక్సాన్: సేఫ్టీ విషయంలో మరోసారి నిరూపించుకున్న టాటా!

3.టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: కొనవచ్చా...? కొనకూడదా....?

4.టాటా నెక్సాన్ Vs మారుతి వితారా బ్రిజా: ఏది బెస్ట్?

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon Global NCAP Crash Test Results Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X