టాటా నెక్సాన్ సన్‌రైజర్స్ హైదారాబాద్ ఎడిషన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సూచించే డీకాల్స్ మరియు కాస్మొటిక్ మార్పులతో మరో ఎడిషన్‌లో టాటా నెక్షాన్ టాటా డీలర్ వద్ద దర్శనమిచ్చింది.
ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న 11 ఎడిషన్ ఐపిఎల్ 2018 సీజన్‌లో టాటా నెక్సాన్ అధికారిక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీయ మరియు అంతర్జాతీయ క్రికెట్ ప్రియులను ఆకట్టుకోవడానికి టాటా నెక్సాన్ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని ఐపిఎల్ 2018 సీజన్‌లో ఆడుతున్న వివిద రకాల జట్ల ప్రేరణతో ఆయా టీములకు అనుగుణంగా స్పెషల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీలను సిద్దం చేస్తోంది. ఇది వరకే, ముంబాయ్ ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్‌లో నెక్సాన్ ఎస్‌యూవీ టాటా డీలర్ల వద్ద పట్టుబడింది.
ఇప్పుడు తాజాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సూచించే డీకాల్స్ మరియు కాస్మొటిక్ మార్పులతో మరో ఎడిషన్‌లో టాటా నెక్షాన్ టాటా డీలర్ వద్ద దర్శనమిచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీలో ఉన్న ప్రధాన హైలైట్స్‌లో మ్యాట్ మెటాలిక్ రెడ్ వ్రాప్ ఉన్న రూఫ్ టాప్ మరియు ఎస్‌యూవీకి ఇరువైపులా క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. ఇదే ఎరుపు రంగు పట్టీ వెనుక బంపర్, ఫ్రంట్ బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ మీద గమనించవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఫాల్కన్ లోగో ప్రేరణతో వచ్చిన పక్షి రెక్కలు గల డీకాల్స్ ఎస్ఆర్‌హెచ్ వెర్షన్ నెక్సాన్ ఎస్‌యూవీ వెనుక డోర్ల మీద ఉన్నాయి. స్టాండర్డ్ వెర్షన్ నెక్సాన్ ఎస్‌యూవీ కూడా డ్యూయల్ టోన్ రంగుల్లో లభిస్తుంది. అయితే, ఎరుపు రంగు పట్టీలు ఇందులో అదనం అని చెప్పవచ్చు.

ముంబాయ్ ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ తరహాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎడిషన్ థీమ్ కూడా నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ ప్లస్ ఆధారంగా రూపొందించారు. ఇతర ప్రత్యేకతల్లో ఇల్యుమినేటెడ్ టాటా సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సొబగులు ఉన్నాయి.

ఇవి మినహాయిస్తే, డిజైన్ పరంగా ఈ స్పెషల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇంటీరియర్ మరియి ఇంజన్ స్పెసిఫికేషన్స్ యథావిధిగా వచ్చాయి. అయితే, టాటా మోటార్స్ ఈ స్పెషల్ ఐపిఎల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీలను దేశవ్యాప్తంగా విక్రయిస్తుందా... లేదంటే ఈ మోడిఫికేషన్స్ కేవలం డీలర్ వరకు మాత్రమే పరిమితమా అన్నది తెలియరాలేదు.

సాంకేతికంగా టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బోఛార్జ్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. రెండు ఇంజన్‌లు కూడా 108బిహెచ్‌పి పవర్, 170 మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.
సాంకేతికంగా టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బోఛార్జ్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. రెండు ఇంజన్‌లు కూడా 108బిహెచ్‌పి పవర్, 170 మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.
Video Coutesy: Vinay Kapoor


Click it and Unblock the Notifications








