టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

టాటా షోరూమ్‌లో రోజ్ గోల్డ్ ఎడిషన్ పేరుతో మరో స్పెషల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీ పట్టుబడింది. ఇప్పటి వరకు ఉన్న కార్లతో పోల్చింతే దీని బాడీ పెయింటింగ్ చాలా కొత్తగా, ఇట్రెస్టింగ్‌గా ఉంది.

టాటా మోటార్స్ అతి త్వరలో నెక్సాన్ ఎస్‌యూవీని "నియో ఎడిషన్" పేరుతో స్పెషల్ ఎడిషన్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఓ టాటా షోరూమ్‌లో రోజ్ గోల్డ్ ఎడిషన్ పేరుతో మరో స్పెషల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీ పట్టుబడింది. ఇప్పటి వరకు ఉన్న కార్లతో పోల్చింతే దీని బాడీ పెయింటింగ్ చాలా కొత్తగా, ఇట్రెస్టింగ్‌గా ఉంది.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

అవును, సాధారణంగా మొబైల్ ఫోన్‌లలో వచ్చే రోజ్ గోల్డ్ పెయింట్ స్కీమ్‌తో నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్ ఎస్‌యూవీకి రోజ్ గోల్డ్ పెయింట్ అందించారు. ఎక్ట్సీరియర్ బాడీ పెయింటింగ్‌లో మాత్రమే కాకుండా, ముందు వైపున ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ మరియు ఎయిర్ ఇంటేకర్ వంటివి బ్లాక్ ఫినిషింగ్‌లో వచ్చాయి.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, ఇంపైన రోజ్ గోల్డ్ పెయింట్ స్కీమ్ మరియు విండో అద్దాల వద్ద అంచుల మీద గాఢమైన రోజ్ గోల్డ్ పట్టీని గమనించవచ్చు. రూఫ్ రెయిల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు అల్లాయ్ వీల్స్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఎస్‌యూవీ మీద ఉన్న పేర్లు కూడా రోజ్ గోల్డ్ కలర్‌లోనే ఉన్నాయి.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే లోపలి వైపున రోజ్ గోల్డ్ సొబగులు ఉన్నాయి. డార్క్ గ్రే మరియు రోజ్ గోల్డ్ రంగుల మేళవింపులు గల డ్యూయల్ టోన్ క్యాబిన్, ప్రీమియం సీట్ అప్‌హోల్‌స్ట్రే ఉన్నాయి. మిగతా అన్ని ఫీచర్లు సాధారణ వేరియంట్ల తరహాలోనే ఉన్నాయి.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఉన్నాయి. రెండు ఇంజన్ ఆప్షన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్‌ను నిజానికి షోరూమ్ డీలర్ మోఢిపై చేయించాడు. ఈ పనితనం వెనక తయారీదారుని ప్రమేయం ఏ మాత్రం లేదు. ఈ కలర్ అప్‌డేట్స్ కోసం అయిన ఖర్చుల వివరాలు డీలర్ వెల్లడించలేదు.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఆరు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, ఎట్నా ఆరేంజ్, వెర్మోంట్ రెడ్, మొరొకాన్ బ్లూ, సీటల్ సిల్వర్, గ్లాజ్గో గ్రే మరియు కాల్గరీ వైట్. అయితే, రోజ్ గోల్డ్ పెయింట్ స్కీమ్ నెక్సాన్ ఎస్‌యూవీకి నిజంగా ఒక్క చక్కటి రూపాన్ని తీసుకొచ్చింది.

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

టాటా నెక్సాన్ రోజ్ గోల్డ్ ఎడిషన్ డీలర్ మోడిఫై చేయించిన మోడల్. కంపెనీలు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఎంతో చక్కటింగ్ అందించారు. టాటా మోటార్స్ అతి త్వరలో నియో గ్రీన్ కలర్ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 4, 2018, 10:43 [IST]
English summary
Read In Telugu: Tata Nexon Rose Gold Edition Showcased At A Dealership In Coimbatore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+