టాటా టిగోర్ బజ్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు మరియు ప్రత్యేకతలు
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త టిగోర్ బజ్ స్పెషల్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును తమ టిగోర్ స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్ ఆధారంగా రూపొందించి, ఆవి
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త టిగోర్ బజ్ స్పెషల్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును తమ టిగోర్ స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్ ఆధారంగా రూపొందించి, ఆవిష్కరించింది. సరికొత్త టిగోర్ బజ్ ప్రారంభ ధర రూ. 5.68 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
టాటా టిగోర్ బజ్ స్పెషల్ ఎడిషన్ లభించే వేరియంట్లు, ధరలు, ఫీచర్లు మరియు ఫోటోలతో పాటు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

టాటా మోటార్స్ తమ టిగోర్ స్టైల్‌బ్యాక్ సెడాన్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా, టిగోర్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పరిమిత సంఖ్యలో టిగోర్ బజ్ ఎడిషన్ మోడల్‌ను లాంచ్ చేసింది.

టాటా టిగోర్ రెగ్యులర్ మోడల్‌లోని ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా బజ్ ఎడిషన్ అభివృద్ది చేశారు. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఛాయిస్‌లో లభించే టిగోర్ బజ్ ఎడిషన్ కారును కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే ఎంచుకోవచ్చు.

టాటా టిగోర్ బజ్ ఎడిషన్ ధరలు
- టాటా టిగోర్ బజ్ ఎడిషన్ పెట్రోల్ ధర రూ. 5.68 లక్షలు
- టాటా టిగోర్ బజ్ ఎడిషన్ డీజల్ ధర రూ. 6.57 లక్షలు రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైన టిగోర్ బజ్ కారును రెగ్యులర్ మోడల్‌తో పోల్చుకుంటే, ఇందులో గ్లోజీ బ్లాక్ రూఫ్, పియానో బ్లాక్ ఫినిషింగ్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, డ్యూయల్ టోన్ వీల్ కవర్స్, ఫ్రంట్ గ్రిల్ మరియు బజ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ మీద రెడ్ హైలైట్స్ ఉన్నాయి.

టాటా టిగోర్ బజ్ ఇంటీరియర్‌లో ఎయిర్ వెంట్స్ మరియు ప్రీమియం ఫీల్ కలిగించే ఫ్యాబ్రిక్ సీట్ల మీద బెర్రీ రెడ్ హైలైట్స్ ఉన్నాయి. విలాసవంతమైన ఇంటీరియర్ ఫీల్ కల్పించే డ్యాష్ బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ మీద పియానో బ్లాక్ సొబగులు ఉన్నాయి.

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో జరిగిన కాస్మొటిక్ మెరుగులు మినహాయిస్తే, బజ్ ఎడిషన్ టిగోర్ కారులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. రెండింటిలో అవే మునుపటి 84బిహెచ్‌పి-114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ అదే విధంగా 69బిహెచ్‌పి-140ఎన్ఎమ్ ఉత్పత్తి చేసే 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. రెండింటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

టాటా టిగోర్ ఇండియన్ మార్కెట్లో మూడవ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్‌గా నిలిచింది. టాటా టిగోర్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్, టాటా వారి కనెక్ట్‌నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్ మరియు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హార్మన్ ఆడియో సిస్టమ్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా టిగోర్ బజ్ ఎడిషన్‌లో అక్కడక్కడా జరిగిన కాస్మొటిక్ అప్‌డేట్స్ మినహాయిస్తే పెద్దగా గుర్తించదగిన మార్పులేమీ చోటు చేసుకోలేదు. అయితే, ఇప్పటి వరకు ఉన్న టిగోర్ కార్లలో విభిన్నమైన టిగోర్ మోడల్ ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు బజ్ ఎడిషన్ టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. టాటా టిగోర్ బజ్ ఎడిషన్ గురించి మరి మీ అభిప్రాయం ఏంటి? క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి...


Click it and Unblock the Notifications








