విడుదలకు సిద్దమైన మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీ

విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మిత్సుబిషి పజేరో స్పోర్ట్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీగా శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‍‌యూవీని మహీంద్రా ఎక్స్‌యూవీ700 పేరుతో విడుదల చేసేందుకు కసరత్త

By Anil Kumar

మీకు తెలుసా...? దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీల విపణిలోకి ప్రవేశించేందుకు సిద్దమైంది. కొరియాకు చెందిన మహీంద్రా భాగస్వామ్యపు దిగ్గజం శాంగ్‌యాంగ్ రూపొందించిన జి4 రెక్ట్సాన్ ఎస్‌యూవీకి మహీంద్రా పలు పరీక్షలు నిర్వహించింది.

విడుదలకు సిద్దమైన మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీ

విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మిత్సుబిషి పజేరో స్పోర్ట్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీగా శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‍‌యూవీని మహీంద్రా ఎక్స్‌యూవీ700 పేరుతో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

విడుదలకు సిద్దమైన మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీ

సుమారుగా రూ. 22 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మహీంద్రా ఇండియా లైనప్‌లో అత్యంత ఖరీదైన మరియు హైఎండ్ మోడల్‌గా నిలవనుంది. మహీంద్రా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. కానీ ప్రీమియం ఎస్‌యూవీల విభాగంలో ఒక్క మోడల్‌ను కూడా ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌యూవీ700 విడుదలతో ఈ సెగ్మెంట్లోకి కూడా అరగేట్రం చేయనుంది.

విడుదలకు సిద్దమైన మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీ

ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీకి కావాల్సిన ప్రధాన విడి భాగాలను దిగుమతి చేసుకుని చకన్‌లో ఉన్న కంపెనీ ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయించనున్నారు. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యూవీ700 పరీక్షలు నిర్వహిస్తుండగా పలు ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి.

విడుదలకు సిద్దమైన మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీ

మహీంద్రా ఎక్స్‌యూవీ700 చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. భారీ రూపంతో ఫార్చ్యూనర్ కంటే పెద్దదిగా కనబడుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 పొడవు 4,850ఎమ్ఎమ్, వెడల్పు 1,960ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,800ఎమ్ఎమ్‌గా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 7-సీటర్ ఎస్‌యూవీ

భద్రత పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో 9-ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, యాక్టివ్ రోల్-ఓవర్ ప్రొటెక్షన్, అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అత్యంత కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 7-సీటర్ ఎస్‌యూవీ

సాంకేతికంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 కేవలం సింగల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులోని శక్తివంతమైన 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 187బిహెచ్‌‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 7-సీటర్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ ఇండియన్ ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో కీలక పాత్ర పోషించనుంది. అత్యంత సరసమైన ధరలో 7-సీటింగ్ లేఔట్లో, దిగ్గజ ఎస్‌యూవీలలో ఉండే అన్ని రకాల లగ్జరీ ఫీచర్లతో రానుండటంతో విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఇంకా ఎన్నో మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Source: Carwale

More from DriveSpark

Article Published On: Thursday, July 19, 2018, 13:38 [IST]
English summary
Read In Telugu: Toyota Fortuner rival Mahindra XUV700 luxury SUV SPIED without camouflage ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+