టయోటా షోరూమ్‌లో మారుతి కార్లు: తొలి మోడల్ టయోటా బాలెనో
సుజుకి-టయోటా భాగస్వామ్యంతో ఇరు సంస్థలు తమ ఉత్పత్తులను పంచుకుని విక్రయించనున్నాయి. అందులో భాగంగా, మారుతి సుజుకి బాలెనో కారును టయోటా బ్రాండ్ పేరుతో టయోటా మోటార్స్ విక్రయించనుంది.
సుజుకి-టయోటా భాగస్వామ్యంతో ఇరు సంస్థలు తమ ఉత్పత్తులను పంచుకుని విక్రయించనున్నాయి. అందులో భాగంగా, మారుతి సుజుకి బాలెనో కారును టయోటా బ్రాండ్ పేరుతో టయోటా మోటార్స్ విక్రయించనుంది.

అవును మీరు చదివింది నిజమే, వచ్చే ఏడాది నుండి టయోటా బాలెనో, మారుతి ఎటియోస్ వంటి మోడళ్లు దేశీయ విపణిలో విడుదల కానున్నాయి. మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టపరుచుకోవడానికి మారుతి మరియు టయోటా మధ్య ఈ ఉమ్మడి భాగస్వామ్యం ఏర్పడింది.

సుజుకి మోటార్ కార్పోరేషన్ తొలుత 25,000 యూనిట్ల బాలెనో కార్లను టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌కు సరఫరా చేయనుంది. వీటికి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా పలు మార్పులు చేర్పులు నిర్వహించి టయోటా బ్యాడ్జ్ పేరుతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మార్కెట్లో విక్రయించనుంది.

సమాచార వర్గాల కథనం మేరకు, టయోటా కంపెనీ విక్రయించిన తొలి మారుతి ఉత్పత్తి బాలెనో మోడల్ అని జపాన్‌లోని ఇరు కంపెనీల ప్రధాన కార్యాలయాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా, ఎన్ని కార్లను సరఫరా చేయాలనే విషయాన్ని కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

భారత్‌లో టయోటా మరియు మారుతి సుజుకి మధ్య కుదిరిన భాగస్వామ్యపు ఒప్పందంలో భాగంగానే బాలెనో హ్యాచ్‌బ్యాక్ కార్లను మారుతి టయోటాకు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఈ రెండు జపాన్ దిగ్గజాల మధ్య ఒప్పందం కుదిరింది.

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుతో పాటు వితారా బ్రిజా మోడల్‌ను కూడా టయోటాకు సరఫరా చేయనుంది. అదే విధంగా మారుతి డీలర్లు విక్రయించేందుకు, టయోటా మోటార్స్ కరోలా ఆల్టిస్ మోడళ్లను సరఫరా చేయనుంది.

ఇండియాలో అత్యంత పోటీతత్వముతో ఉన్న హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రీ-బ్యాడ్జితో వస్తున్న బాలెనో సేల్స్ ద్వారా టయోటా తన ప్రాబల్యాన్ని చూపనుంది. దేశీయ హ్యాచ్‌బ్యాక్ కెటగిరీలో ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌ను మాత్రమే విక్రయిస్తోంది.

బాలెనో కారును ప్రస్తుతం గుజరాత్‌లోని సుజుకి ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. మారుతి నుండి బాలెనో కార్ల సరఫరా ప్రారంభమైతే, కర్నాటకలోని టయోటా ప్రొడక్షన్ ప్లాంటులో ఉన్న అదనపు ప్రొడక్షన్ లైన్‌ను బాలెనో కోసం ఉపయోగించనుంది.

మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుడంటంతో, టయోటా ఇండియా బాలెనో ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఆశించిన మేర రాణించలేకపోయిన టయోటాకు ఇదొక గొప్ప అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి బాలెనో 2015లో తొలిసారిగా దేశీయ విపణిలోకి విడుదలయ్యింది, అప్పటి నుండి మోస్ట్ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా రాణిస్తోంది. అయితే, ఇప్పుడు ఇదే బాలెనో కారును ఒక వైపు మారుతి సుజుకి మరో వైపు రీ-బ్యాడ్జితో టయోటా విక్రయించడంతో బాలెనో సేల్స్ మరింత పుంజుకోనున్నాయి. టయోటా విక్రయించనున్న బాలెనో కారులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో అని తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








