Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త సిక్స్ సీటర్ ఎంపివి కారు వేరియంట్లను వెల్లడించిన మారుతీ సుజుకి
మారుతి సుజుకి తమ ప్రీమియమ్ సిక్స్ సీటర్ ఎంపివి ను ఆగస్టు 21 వ తేదీన ఇండియన్ మార్కెట్లో పరిచయం చేయనున్నారు. కొత్త ఎంపివి ని, ఎక్స్ఎల్6 అనే పేరుతో పిలుస్తారు దీనిని దేశీయ మార్కెట్లో పాపులర్ మోడల్ ఎర్టిగా మోడల్ ఆధారంగా తాయారు చేయబడింది.

ఆటోకార్ ఇండియా నుండి అందిన నివేదికల ప్రకారం, భారతదేశంలో ప్రారంభించబోయే కొత్త మారుతి ఎక్స్ఎల్6 రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది అవి ఆల్ఫా మరియు జీటా. మారుతి సుజుకి వారి ప్రీమియమ్ నెక్స డీలర్ షిప్ లలో ప్రత్యేకంగా ఈ ఎంపివిలను విక్రయిస్తుంది, అలాగే స్టాండర్డ్ ఎర్టిగా షోరూమ్ లలో కూడా విక్రయాలను కొనసాగించనుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 యొక్క రెండు వేరియంట్ల మీద స్టాండర్డ్ గా అందించబడే కొన్ని ఫీచర్లు రెండవ వరుసలో, ఎల్ఈడి లైట్లు హెడ్ ల్యాంప్స్, టెయిల్ లైట్స్ మరియు డిఆర్ఎల్ తో సహా అన్ని కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు లలో సిల్వర్ యాక్ లు, రియర్ వాష్ వైప్ ఫంక్షన్, హైట్ ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు మారుతి సుజుకి నుంచి లేటెస్ట్ స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో కూడిన ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్ ను కలిగి ఉంటాయి. కొత్త ప్రీమియమ్ ఎంపివి, ఈ ఎక్స్ఎల్6 పలు సందర్భాల్లో రహస్యంగా టెస్టింగ్ చేస్తుండగా ఇటీవల వార్తల్లో నిలిచింది.

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 యొక్క ఇంటీరియర్స్ కూడా ఇటీవల లీక్ చేయబడ్డాయి, పైన పేర్కొన్న అనేక ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ ని బహిర్గతం చేసింది. డిజైన్ పరంగా మారుతి సుజుకి ఎక్స్ఎల్6 అప్డేట్ అయిన ఫ్రంట్ ప్రొఫైల్ తో వస్తుంది.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
ఇందులో సెంటర్ లో క్రోమ్ స్ట్రిప్ తో ఒక కొత్త ట్రెపీజోడల్ గ్రిల్, ఒక బానెట్ తో మరింత నిటారుగా ఉండే ఫ్రంట్ ప్రొఫైల్, అప్డేట్ చేసిన హెడ్ ల్యాంప్ క్లస్టర్ మరియు ఇతర ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్స్ ను కూడా కలిగి ఉంటుంది.

ఎక్స్ఎల్6 యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ ఎర్టిగ తరహాలోనే ఉంటుంది, అయితే ఇప్పుడు ఇందులో ఎత్తు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ మరియు బ్లాక్ క్లాడింగ్ అంతటా మెరుపులతో ఉంటుంది.

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ప్రీమియమ్ ఎంపివి, బిఎస్-6 కలిగిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పవర్ అందించబడుతుంది, ఇది 104బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు మారుతి యొక్క SHVS (తేలికపాటి హైబ్రిడ్) టెక్నాలజీకి కూడా ఇందులో వస్తుంది.

ఇంజిన్ రెండు ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లతో ఉంటుంది: ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ లను కలిగి ఉంటుంది. దేశంలో పాపులర్ ఎర్టిగా ఎంపివి యొక్క ప్రీమియం వెర్షన్ గా మారుతి సుజుకి ఎక్స్ఎల్6 రానుంది.

ఇది సిక్స్ సీటర్ వేరియంట్ గా వచ్చి నెక్స వద్ద ప్రత్యేకంగా విక్రయిస్తుంది. కొత్త ఎమ్ పివి కొరకు బుకింగ్ లు ఇంకా అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది మరియు ఇది ఆగస్టులో ప్రారంభం అవుతుందని మేం ఆశిస్తున్నాం. మారుతి ఎక్స్ఎల్6 ధర ప్రామాణిక నమూనా కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశము ఉంది.
Source: Autocarindia