మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ తమ మొట్టమొదటి ఉత్పత్తి ఎంజీ హెక్టర్ ఎస్‌యూవీని ఇటీవల దేశీయ విపణిలోకి రూ. 12.18 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఎంజీ హెక్టర్ విడుదల సందర్భంగా ఎంజీ మోటార్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, రానున్న రెండేళ్లలోపు నాలుగు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇండియన్ మార్కెట్ కోసం ఎంజీ మోటార్స్ సిద్దం చేస్తున్న మోడళ్లు ఏవో ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి..

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఇండియన్ కస్టమర్లు ఎస్‌యూవీలను ఎక్కువగా ఇష్టపడతారనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బహుశా ఈ లాజిక్‌తోనే కాబోలు ఎంజీ మోటార్స్ తొలుత ఎస్‌యూవీ సెగ్మెంట్ మీదనే పూర్తిగా ఆధారపడుతోంది.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఎన్నో ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలకు ఆయువుపట్టుగా నిలిచింది. ప్రారంభంలో ఎస్‌యూవీ మార్కెట్ మీద దృష్టిపెడుతూ పలు నూతన ఎస్‌యూవీలను ఆవిష్కరించి ఆ తర్వాత ఇతర సెగ్మెంట్ల మీద దృష్టి పెడుతున్నాయి. అందులో ఎంజీ మోటార్స్ ఒకటి. పలు ఎస్‌యూవీలను లాంచ్ చేసి దేశీయ సెగ్మెంట్లో బలమైన పోటీగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటగా హెక్టర్ ఎస్‌యూవీనే లాంచ్ చేసింది.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ విడుదల చేయాలని భావిస్తున్న మరో నాలుగు ఎస్‌యూవీలలో ఎంజీ ఇజడ్ఎస్ (eZS) ఒకటని ఆటోకార్ ఇండియా ఓ కథనంలో వెల్లడించింది. ఎంజీ eZS‌ ఎస్‌యూవీ ఒక విప్లవాత్మక మోడల్. ఎందుకంటే ఇది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎంజీ eZS మోడల్‌ను ప్రస్తుతం చైనాలో అమ్మకాల్లో ZS ఎస్‌యూవీ ఆధారంగా ఎంజీ మోటార్స్ అభివృద్ది చేస్తోంది. ఇప్పటికే ఎంజీ eZS మోడల్‌ను ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు రహస్యంగా పరీక్షించింది. ఎంజీ eZS ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఓ వీడియోను కూడా ఎంజీ రిలీజ్ చేసింది. దీనిని 2019 చివరి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎంజీ eZS ఎస్‌యూవీ తర్వాత స్థానంలో ఉన్న మోడల్ హెక్టర్ ఎస్‌యూవీ 7-సీటర్ వెర్షన్ అని తెలుస్తోంది. మరో రెండు సీట్లు అదనంగా ఉండేలా డిజైన్ చేసి, అత్యంత శక్తివంతమైన ఇంజన్ మరియు డిజైన్‌లో పలు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కానీ హెక్టర్ 7-సీటర్ ఎస్‌‌యూవీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యధిక సేల్స్ సాధించిపెట్టే విభాగం కాంపాక్ట్ ఎస్‌యూవీ. కాంపాక్ట్ ఎస్‌యూవీలు మిగతావాటి కంటే చిన్నగా ఉండి, తక్కువ ధరలోనే లభిస్తాయి. ఎంజీ ఇండియా సేల్స్ పెంచుకునేందుకు తమ నాలుగవ మోడల్‌గా కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇది హెక్టర్ కింది స్థానాన్ని భర్తీ చేస్తుంది.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎంజీ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు ప్రెసిడెంట్ రాజీవ్ చబా మాట్లాడుతూ, "ఇండియన్ మార్కెట్ అత్యంత వ్యూహాత్మకమైనది, చైనా దిగ్గజం SAIC మరియు MG ఇరు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో దేశీయంగా తమ ఉత్పత్తులను పెంచుకునే, మార్కెట్‌ను విస్తరించేందుకు అధిక మొత్తం పెట్టుబడులు పెడుతున్నాము. గుజరాత్‌లోని హలోల్ ప్రాంతంలో ఉన్న జనరల్ మోటార్స్‌కు చెందిన ప్లాంటును కొనుగోలు చేసి సుమారుగా 2,200 కోట్లు పెట్టుబడి పెట్టాము" అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా భవిష్యత్తులో హ్యాచ్‌బ్యాక్ కార్ల మీద దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు.

మరో నాలుగు ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన తొలి మోడల్ ఎంజీ హెక్టర్ భారీ విజయాన్ని అందుకొంది. నెల రోజులు కూడా గడవకముందే ఏకంగా 10,000 పైగా బుకింగ్స్ సాధించింది. అద్భుతమైన నిర్మాణ నాణ్యత, భద్రత, అత్యాధునిక ఫీచర్లను నమ్మశక్యంగాని ధరతో లాంచ్ చేయడంతో హెక్టర్ ఎస్‌యూవీని విజయం వరించింది. భవిష్యత్తులో రానున్న కొత్త మోడళ్లు కూడా ఇదే విజయాన్ని అందుకుంటాయని ఆశిద్దాం.

More from DriveSpark

Article Published On: Monday, July 1, 2019, 11:28 [IST]
English summary
MG Motor India To Launch Four SUVs Over The Next Two Years — Includes eZS & 7-Seat Hector. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+