నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనాలనుకుంటున్నారా..? కొనే ఆలోచనలో ఉంటే.. నెక్సాన్ ఎస్‌యూవీనే ఖాయం చేసుకోండి. ఎందుకంటే మీ ఇష్టాన్ని మరియు నమ్మకాన్ని మరింత పెంచేలా టాటా మోటార్స్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అవును, టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో పలు నూతన ఫీచర్లను అదనంగా జోడిస్తున్నట్లు ప్రకటించింది.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో నూతనంగా పరిచయం చేస్తున్నటువంటి ఫీచర్ల గురించిన ఓ సర్క్యులర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లకు పంపింది. వీటికి సంభందించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. టాటా నెక్సాన్ ఫీచర్ల అప్‌గ్రేడ్ గురించి టాటా అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయనుంది.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ XE మినహా అన్ని వేరియంట్లలో కూడా మార్పులు జరిగినట్లు స్పష్టమవుతోంది. XM మరియు XMA వేరియంట్లలో ఎమ్ఐడి సిస్టమ్ కోసం అభివృద్దిపరిచన కొత్త ఫాంట్ స్టైల్, వార్మ్ గ్రే కలర్ ఫినిషింగ్‌లో వచ్చిన డ్యాష్ బోర్డు మీదున్న మిడ్ ప్యాడ్‌, పియానో బ్లాక్ ఫినిషింగ్ గల గేర్ నాబ్ అదే విధంగా ఏసీ మరియు సెంటర్ ప్యానల్‌లో కొన్ని మార్పులు జరిగాయి.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

నెక్సాన్ XT వేరియంట్లో సరికొత్త డిజైన్‌లో వచ్చిన రూఫ్ రెయిల్స్, వెనుక సీట్లో కూర్చునే ప్యాసింజర్ల కోసం కూల్డ్ ఎయిర్ వెంట్స్, ముందువైపు ఉండే ఏసీ కన్సోల్ ద్వారా ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేసిన ఫాంట్ స్టైల్స్ మరియు పెద్దా యాంటెన్నా ఈ వేరియంట్లో ఉన్నాయి.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

XZ మరియు XZ+ వేరియంట్లలో పైన పేర్కొన్న సరికొత్త డిజైన్‌లో రూఫ్ రెయిల్స్ మరియు అప్‌డేటెడ్ ఏసీ వెంట్స్‌తో పాటు మరెన్నో అదనపు ఫీచర్లను నూతనంగా పరిచయం చేశారు. టాటా మోటార్స్ విక్రయిస్తున్న అత్యధికంగా కార్లలో టాటా నెక్సాన్ ఒకటి, అందుకు దీని డిజైన్ మరియు ఫీచర్లనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

అంతే కాదండోయ్.. సేఫ్టీ పరంగా టాటా నెక్సాన్ ఎందుకు కొన్నామా...? అని ఏనాడూ భాదపడాల్సిన పనిలేదు. ఎందుకంటే సేఫ్టీ కోసం నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందిన ఏకైక ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సాంకేతికంగా రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. 1.5-లీటర్ రివో టార్క్ టుర్బో డీజల్ ఇంజన్ గరిష్టంగా 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, 1.2-లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

నెక్సాన్ ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు పరిచయం చేసిన టాటా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా నెక్సాన్ ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో నిండిన ఓ అద్భుతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ. టాటా విక్రయిస్తున్న కార్లలో నెక్సాన్ బెస్ట్ సెల్లింగ్ మోడల్. కస్టమర్లు అభిరుచి మరియు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఎన్నో కొత్త ఫీచర్లను జోడించింది. బడ్జెట్ రేంజ్‌లో అత్యుత్త టెక్నాలజీతో ఓ మంచి ఎస్‌యూవీ ఎంచుకోవాలనుకునే వారికి టాటా నెక్సాన్ ఓ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Source: Team BHP

More from DriveSpark

Article Published On: Tuesday, June 25, 2019, 9:36 [IST]
English summary
Tata Motors Updates Nexon With New Interior Features. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+