కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా ఇటీవలే తమ సరికొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. సరికొత్త డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నాలజీలతో కలయికతో ఈ కొత్త తరం థార్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ చేసిన కొత్త 2020 మహీంద్రా ధార్‌ను కంపెనీ అధికారికంగా అక్టోబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ నేపథ్యంలో, కొత్త తరం మహీంద్రా థార్‌కు సంబంధించిన బ్రోచర్ ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. తాజాగా, 91వీల్స్ లీక్ చేసిన బ్రోచ్‌లో కొత్త 2020 మహీంద్రా థార్‌లో ఆఫర్ చేయబోయే ఫీచర్ల వివరాలను హైలైట్ చేశారు. ఇందులో థార్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన యాక్ససరీల వివరాలను కూడా పేర్కొన్నారు.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

కొత్త థార్ కోసం లభించే యాక్ససరీస్ జాబితాలో ఎక్స్‌టీరియర్ స్టైల్ ప్యాక్, క్రోమ్ ప్యాక్, బ్లాక్ ఫ్రంట్ బంపర్ క్లాడింగ్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, హెడ్‌లైట్ క్రోమ్ అప్లిక్యూస్, రెయిన్ వైజర్స్, బాడీ డెకాల్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, విభిన్న సీట్ కవర్ డిజైన్స్, స్టీరింగ్ కవర్, లామినేషన్ మ్యాట్, మాగ్నెటిక్ సన్ షేడ్ మొదలైన ఆప్షనల్ యాక్ససరీలు కూడా ఉన్నాయి.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

మునుపటి తరం మోడల్‌తో కొత్త ఎస్‌యూవీని పోల్చి చూస్తే, కొత్త 2020 థార్ మునుపటి తరం మోడళ్లలో ప్రాథమికంగా పరిగణించబడిన అన్ని అంశాల కన్నా ఒకడుగు ముందంజలోనే ఉంటుందని చెప్పాలి. ఎక్స్‌టీరియర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫీచర్లు, పరికరాలు అన్నీ కూడా ప్రస్తుత కాలం మరియు తాజా సాంకేతికతలకు అనుగుణంగా ఉంటాయి.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ప్రత్యేకించి థార్ ఇంటీరియర్స్‌లో ఇప్పుడు అనేక రకాల ఫీచర్లు మరియు పరికరాలు లభిస్తాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేని సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ కొత్త తరం ఎస్‌యూవీలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ ఆప్షన్స్. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.

కొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్ లీక్; ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

కొత్త మహీంద్రా థార్ బ్రోచర్ లీక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఖచ్చితంగా దాని మునుపటి తరం మోడళ్ల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. ఈ కొత్త తరం ఎస్‌యూవీలో ఇప్పుడు మరింత మెరుగైన స్థలం, ప్రీమియం ఇంటీరియర్స్, కొత్త ఇంజన్ ఆప్షన్స్ మరియు తాజా డిజైన్‌ను మనం గమనించవచ్చు. ఇందులోని అధునాతన ఫీచర్లతో ఇప్పుడు ఇది మరింత ఎక్కువ కస్టమర్లను ఆకర్షింవచవచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 16, 2020, 12:34 [IST]
English summary
Mahindra recently took the wraps off the all-new 2020 Thar. The offroader has been well-received because of its new design, features, performance and technology. The company will be launching the 2020 Thar on October 2, 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+