ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్రీస్టైల్ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఫోర్డ్ ఫ్రీస్టైల్ 'ఫ్లెయిర్' అనే స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ కాగా, తాజాగా ఈ వేరియంట్ బ్రోచర్ కూడా విడుదలకు ముందే లీక్ అయ్యింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

స్టాండర్డ్ ఫ్రీస్టైల్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, ఈ కొత్త ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉండనున్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఫ్లెయిర్ వేరియంట్‌ను టాప్-స్పెక్ టైటానియం ప్లస్ వేరియంట్‌పై ఆధారపడి తయారు చేశారు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ స్పెషల్ ఎడిషన్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త బూట్ లిడ్ డిజైన్ వంటి కాస్మోటిక్ మార్పులే కాకుండా దీని రూఫ్ మొత్తాన్ని నలుపు రంగు‌లో ఫినిష్ చేశారు. అలాగే రూఫ్ రెయిల్స్ మరియు సైడ్ మిర్రర్లను కాంట్రాస్ట్ రెడ్ కలర్‌లో ఫినిష్ చేశారు. రెండు చివర్లలోని స్కఫ్ ప్లేట్లు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి. అల్లాయ్ వీల్స్ పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. ఈ మార్పులన్నీ హ్యాచ్‌బ్యాక్‌కు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఇంటీరియర్స్‌లో కూడా ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్ మోడల్ కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులోని సీట్లు మరియు డోర్ ట్రిమ్స్‌పై కాంట్రాస్ట్ రెడ్ కలర్ స్టిచింగ్ ఉంటుంది. కొత్త ‘ఫ్లెయిర్' వేరియంట్ పేరును డ్యూయల్ టోన్ సీట్ అప్‌హోలెస్ట్రీపై ముద్రించబడి ఉంటుంది. అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ చుట్టూ పియానో బ్లాక్‌లో ఫినిష్ చేలిన బెజెల్ ఉంటుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఈ కొత్త వేరియంట్‌లో పైన పేర్కొన్న మార్పులు తప్ప వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇంజన్ పరంగా కూడా కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. స్టాండర్డ్ ఫ్రీస్టైల్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లనే కొత్త ఫ్లెయిర్ వేరియంట్‌లోను ఆఫర్ చేయనున్నారు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 95 బిహెచ్‌పి పవర్‌ని మరియు 119 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పుష్-బటన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, పార్క్ అసిస్ట్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు బ్రాండ్ యొక్క ఫోర్డ్ పాస్ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో స్టాండర్డ్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ మోడల్ రూ.5.99 లక్షల నుండి రూ.8.49 లక్షల మధ్య అమ్మడవుతోంది. పెట్రోల్, డీజిల్ టైటానియం ప్లస్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.7.39 లక్షలు, రూ.8.49 లక్షలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న ఫ్లెయిర్ వేరియంట్ ధర స్టాండర్డ్ టైటానియం ప్లస్ వేరియంట్ ధర కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఫోర్డ్ మోటార్స్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న కొత్త బిఎస్6 వెర్షన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ధరను కంపెనీ తొలిసారిగా పెంచింది. వేరియంట్‌ను బట్టి దీని ధరలు రూ.44,000 నుంచి రూ.1.20 లక్షల మేర పెరిగాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ బ్రోచర్ లీక్ - కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లను, వివరాలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌పై డ్రైవ్‌‍స్పార్క్ అభిప్రాయం.

ఫోర్డ్ తమ స్పెషల్ ఎడిషన్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌కు అనేక అదనపు హంగులను జోడించింది. ఇప్పుడు ఈ వేరియంట్ స్టాండర్డ్ మోడల్ కన్నా మరింత ఆకర్షణీయంగా మారింది. అతి త్వరలోనే ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో చేసిన మార్పుల కారణంగా, దీని ధర కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 11, 2020, 17:35 [IST]
English summary
The Ford Freestyle crossover hatchback will receive a new special edition variant called Flair in the Indian market. The company is expected to launch the new variant soon and could be available for a limited time. Read in Telugu.
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+